ఆ రాష్ట్రంలో.. పెట్రోలు కొనుగోళ్లపై ఆంక్షలు..!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి వికృత రూపం తీవ్రమవుతోంది. పెట్రోలు, డీజిల్ సైతం కావలసినంత అందుబాటులో లేని పరిస్థితులు వచ్చాయి. ఇంధనం నిల్వల

ఆ రాష్ట్రంలో.. పెట్రోలు కొనుగోళ్లపై ఆంక్షలు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 11, 2020 | 5:49 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి వికృత రూపం తీవ్రమవుతోంది. పెట్రోలు, డీజిల్ సైతం కావలసినంత అందుబాటులో లేని పరిస్థితులు వచ్చాయి. ఇంధనం నిల్వల కొరత వల్ల పెట్రోలు అమ్మకాలు, కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు మిజోరాం ప్రభుత్వం ప్రకటించింది. ఐజ్వాల్ బైపాస్ రోడ్డులోని హ్మంగ్‌ఖవత్లిర్, సెత్వాన్ మధ్య ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించినందువల్ల ఆయిల్ ట్యాంకర్లు చిక్కుకుపోవడం, నత్తనడకన రావడం జరుగుతోంది.

రాజధాని ఐజ్వాల్‌లోని చాలా పెట్రోలు బంకులు ఇప్పటికే నో స్టాక్ బోర్డులు పెట్టేశాయి. ఇంధన నిల్వలు తగ్గడంతో.. ప్రభుత్వ ఆంక్షల ప్రకారం.. ఒక స్కూటర్‌కు 3 లీటర్లు, ఇతర ద్విచక్ర వాహనానికి 5 లీటర్లు, లైట్ మోటార్ వెహికల్‌కు 10 లీటర్లు, మ్యాక్సీ క్యాబ్‌ లేదా పికప్ ట్రక్ లేదా మినీ ట్రక్ లేదా జిప్సీకి 20 లీటర్లు, సిటీ బస్సు లేదా మీడియం ట్రక్‌కు 100 లీటర్లు వరకు మాత్రమే ఇంధనం అమ్మడానికి అనుమతి ఇచ్చారు. అయితే బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల రవాణా వాహనాలవారు సరిపడినంత ఇంధనం కొనుక్కోవచ్చు.

Read More:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు..

గుడ్ న్యూస్: ఔట్‌సోర్సింగ్‌ నర్సుల జీతాల పెంపు