AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kasturba Gandhi Death Anniversary : నేడు కస్తూరిబాయి గాంధీ 77వ వర్ధంతి.. ఆమె జీవిత ప్రయాణంపై స్పెషల్ స్టోరీ

కస్తూరిబాయి మోహన్‌దాస్ గాంధీ భారత రాజకీయ కార్యకర్త. కస్తూరిబాబు మహాత్మా గాంధీకి భార్య. ఆమె తన భర్త, కుమారునితో పాటు భారత స్వాతంత్య్ర సమరోద్యమంలో పాల్గొన్నారు...

Kasturba Gandhi Death Anniversary : నేడు కస్తూరిబాయి గాంధీ 77వ వర్ధంతి.. ఆమె జీవిత ప్రయాణంపై స్పెషల్ స్టోరీ
Surya Kala
|

Updated on: Feb 22, 2021 | 12:04 PM

Share

Kasturba Gandhi Death Anniversary :  కస్తూరిబాయి మోహన్‌దాస్ గాంధీ భారత రాజకీయ కార్యకర్త. కస్తూరిబాబు మహాత్మా గాంధీకి భార్య. ఆమె తన భర్త, కుమారునితో పాటు భారత స్వాతంత్య్ర సమరోద్యమంలో పాల్గొన్నారు.. బ్రిటిష్ పాలకులనుంచి మన దేశానికి స్వాతంత్య్రం లభించాడానికి పోరాడిన సమరంలో మహాత్మా గాంధీకి భార్య కస్తూరిబాయి తనదైన సేవలను అందించారు. ఆయన నడిచిన బాటలోనే నడుస్తూ.. మహిళల్లో చైతన్యం పెంచడంలో ఈమె సేవలు అమోఘం. స్వాతంత్య్ర కోసం బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా చేపట్టిన తిరుగుబాట్లలో పాల్గొన్న కస్తూరిబాయి కూడా నెలలపాటు కఠిన కారాగార శిక్షను అనుభవించారు. గాంధీ జైల్లో వున్న సమయంలో కొన్నిసార్లు ఆయన స్థానంలో ఈమె పనిచేసేది. స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడంలో తనవంతు పాత్ర పోషించిన కస్తూరి.. వారికి క్రమశిక్షణ, విద్యను నేర్పించారు.. ఈ రోజు కస్తూరిబాయి వర్ధంతి నేడు.

జననం తల్లిదండ్రులు కుటుంబ నేపధ్యం:

1869 ఏప్రిల్ 11వ తేదీన పోర్బందర్ లో గోకుల్ దాస్ మాకన్‌జీ కపాడియా వ్రజకున్పర్‌బా దంపతులకు కస్తూరి బాబు జన్మించారు. ఆమె తండ్రి గోకులదాస్ కపాడియా ధనవంతుడైన వ్యాపారస్తుడు.పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో ఆమె గాంధీజితో బాల్యవివాహం చేసుకున్నారు. అప్పుడు ఇద్దరి వయస్సు 13 సంవత్సరాలు. ఈ దంపతులకు మణిలాల్ (1892), రాందాస్ (1897), దేవదాస్ (1900) అని ముగ్గురు కుమారులు. కస్తూరిబాయి పెద్దగా చదువుకోలేదు.. కానీ ఎన్నో కష్ట నష్టాలను దైర్యంగా ఎదుర్కొన్న ధీరవనిత.

రాజకీయ జీవితం :

వివాహం జరిగిన అనంతరం కస్తూరిబాయి తన భర్తతో కలిసి వుండటానికి 1897లో దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడున్న భారతీయుల మీద జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమె నిరసన కార్యక్రమం చేపట్టారు. 1904 నుండి 1914 వరకు ఆమె డర్బన్ సమీపంలోని ఫీనిక్స్ సెటిల్మెంట్ లో చురుకుగా పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఉద్యోగ పరిస్థితులకు వ్యతిరేకంగా 1913లో జరిగిన నిరసన సమయంలో కస్తూరిబాయి అరెస్ట్ అయ్యారు.. మూడునెలల కారాగార శిక్షను అనుభవించారు. ఇక గాంధీ దంపతులు భారతదేశానికి తిరిగి వచ్చిన అనంతరం భర్త జైలులో వున్న సమయంలో ఆమె తన భర్త స్థానంలో పనిచేశారు. స్త్రీలు, పిల్లలకు ఆమె పరిశుభ్రత, క్రమశిక్షణ, చదవటం, వ్రాయటం నేర్పించేవారు. గాంధీజీ నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమం, సబర్మతి ఆశ్రమ లక్ష్యాలకు అనుగుణంగా తన సేవలు అందించారు. భర్త అడుగు జాడల్లో నడుస్తూ ఆదర్శ మహిళ అనిపించుకున్నారు.

వ్యక్తిగత జీవితం :

కస్తూరిబాయి జన్మించినప్పుడే ఆమెకు శ్వాస సంబంధ వ్యాధులు సోకాయి. ఇక ఉద్యమం సమయంలో ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా పలు కార్యక్రమాలను చేపట్టారు. దీంతో మళ్ళీ ఆమె శ్వాసనాళముల వాపుతో జబ్బుపడ్డారు. తర్వాత న్యూమోనియా(ఊపిరితిత్తుల వ్యాధి)తో మరింత తీవ్రం అయింది. ఈ నేపథ్యంలో 1943 మార్చి 16న ఆమెకు మొదటి సారి గుండెపోటు వచ్చింది. పదిరోజుల తర్వాత మార్చి 25న మళ్ళీ గుండెపోటు వచ్చింది. డిసెంబరు నెలలో ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. 1944 ఫిభ్రవరి 22న ఆమె కన్నుమూశారు. గాంధీజీ కస్తూర్బా అరవై రెండేళ్ళ సహజీవనం ముగిసింది.

Also Read:

ఇదీ డిజిటల్ ఇండియా స్థితి ! ఫోన్ సిగ్నల్ కోసం 50 అడుగుల ఎత్తున స్తంభమెక్కి కూర్చున్న మధ్యప్రదేశ్ మంత్రి

Happy Birthday Director Teja : చిత్రం, నువ్వునేను, జయం వంటి సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తేజ పుట్టిన రోజు నేడు