బీహార్ ఎన్నికలపై సోనియా కీలక నిర్ణయం

రాష్ట్రీయ జనతాదళ్ పార్టీతో కలిసి బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సంబంధించి ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి...

  • Rajesh Sharma
  • Publish Date - 5:15 pm, Sun, 11 October 20
బీహార్ ఎన్నికలపై సోనియా కీలక నిర్ణయం

Sonia crucial decision on Bihar polls: రాష్ట్రీయ జనతాదళ్ పార్టీతో కలిసి బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సంబంధించి ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలాను బీహార్ ఎన్నికల నిర్వహణ, సమన్వయ కమిటీ ఛైర్మెన్‌గా నియమించింది. అదే విధంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలను చూసేందుకు ఆరు కమిటీలను ఏర్పాటు చేసింది.

ఎన్నికల నిర్వహణ, నేతల మధ్య సమన్వయం అంశాలు కీలకమని భావించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తమ కోటరీకి చెందిన రణదీప్ సింగ్ సుర్జేవాలాకు కీలక బాధ్యతలు అప్పగించారు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, మాజీ కేంద్ర మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ తదితర 14 మంది నేతలున్న ఈ సమన్వయ కమిటీకి సుర్జేవాలా సారథ్యం వహిస్తారు. సీడబ్ల్యూసీ సభ్యుడు తారీఖ్ అన్వర్, ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్, హర్యానా మంత్రి అజయ్ యాదవ్ తదితరులు కూడా ఈ కమిటీలో వున్నారు.

సమన్వయ కమిటీతో పాటు మరో అయిదు కమిటీలను కూడా సోనియా గాంధీ నియమించారు. ప్రచారం, మీడియా మేనేజ్‌మెంట్, న్యాయపరమైన అంశాలు, బహిరంగ సభల నిర్వహణ, లాజిస్టిక్స్-ఎన్నికల ఆఫీసుల నిర్వహణలపై ఈ అయిదు కమిటీలను ఏర్పాటు చేశారు. మీడియా కమిటీ ఛైర్మెన్‌గా పవన్ ఖేరాను నియమించారు.

Also read: ఔటర్‌కు మరిన్ని అందాలు.. ఇంటర్ ఛేంజ్‌ దగ్గర సూపర్ సౌలతులు

Also read: పండగలున్నాయని ఆదమరవొద్దు.. కేంద్ర మంత్రి హెచ్చరిక

Also read: పాకిస్తాన్‌లో కొనసాగుతున్న ఆలయాల విధ్వంసం

Also read: దుబ్బాక విజయంలో ఆ వర్గాలే కీలకం