పండగలున్నాయని ఆదమరవొద్దు.. కేంద్ర మంత్రి హెచ్చరిక

ఫెస్టివల్ సీజన్ ముందున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డా.హర్షవర్ధన్ దేశ ప్రజలకు సీరియస్ హెచ్చరిక జారీ చేశారు. కోవిడ్ ప్రభావం ఇంకా తొలగిపోలేదన్...

పండగలున్నాయని ఆదమరవొద్దు.. కేంద్ర మంత్రి హెచ్చరిక
Follow us

|

Updated on: Oct 11, 2020 | 2:41 PM

Dont ignore Covid-19 before Festivals:  ఫెస్టివల్ సీజన్ ముందున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డా.హర్షవర్ధన్ దేశ ప్రజలకు సీరియస్ హెచ్చరిక జారీ చేశారు. కోవిడ్ ప్రభావం ఇంకా తొలగిపోలేదన్న వాస్తవాన్ని దేశ ప్రజలందరూ మరవొద్దని, కోవిడ్ నిబంధనలను విస్మరించవద్దన్నది ఆయన చేసిన హెచ్చరిక సారాంశం. కోవిడ్ నిబంధనలను పాటించకపోతే.. కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుందన్న విషయాన్ని మరిచి పోవద్దని ఆయనంటున్నారు.

సండే సంవాద్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి ఆదివారం దేశప్రజల నుద్దేశించి మాట్లాడారు. వచ్చే వారం దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయని, ఆ వెంటనే దసరా.. మరికొన్ని రోజులకే దీపావళి పండుగలు వస్తాయని ఆయన గుర్తు చేశారు. నవంబర్‌లో ఉత్తర భారత దేశంలో ఛత్ పూజలు జరుగుతాయన్నారు. కొన్ని రోజులుగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా.. పండుగ రోజుల్లో కోవిడ్ నిబంధనలను విస్మరిస్తే.. కరోనా మహమ్మారి మరోసారి విజృంభించే ప్రమాదం పొంచి వుందని ఆయన గుర్తు చేశారు. అది మరింత ప్రమాదమని ఆయన తెలిపారు.

ఏ మతము, ఏ మత పెద్ద ప్రాణాలను రిస్కులో పెట్టి పూజలు చేయమని, సామూహిక వేడుకలు నిర్వహించమని చెప్పరన్న విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలని కేంద్ర మంత్రి అన్నారు. ఏ దేవుడు తనను కేవలం సామూహిక ప్రార్థనలు, పూజల ద్వారానే కొలువుమని చెప్పడని.. అందుకే పండుగల వేళల్లో ఇళ్ళకే పరిమితమవడం ప్రస్తుత పాండమిక్ పరిస్థితిలో అత్యంత శ్రేయస్కరం అని ఆయన సూచించారు. ప్రశాంత చిత్తంతో, మనస్పూర్తిగా దేవున్ని ఎక్కడి నుంచి కొలిచినా సరిపోతుందన్న విషయాన్ని విస్మరించ వద్దని ఆయనంటున్నారు.

రెండు గజాలు దూరం పాటించడం, మాస్కును విధిగా ధరించడం, తరచూ శానిటైజ్ చేసుకోవడం అనివార్యమని ఆయన ప్రజలకు సూచించారు. వైద్య మంత్రిగా దేశ ప్రజలకు తగిన సూచనలు చేయడం, వారి ప్రాణాలను రక్షించడం తన కర్తవ్యమని ఆయనన్నారు.

ఇదిలా వుండగా ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 70 లక్షలు దాటింది. అయితే రోజూ వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. 15 రోజుల క్రితం ప్రతీ రోజూ లక్షకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు అవగా.. గత నాలుగైదు రోజులుగా రోజూ 70 వేలలో కేసులు నమోదు అవుతున్నాయి. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షలలోకి తగ్గడం మంచి పరిణామంగా కనిపిస్తోంది. అదే సమయంలో క్యూర్ అయిన వారి సంఖ్య 60 లక్షలు దాటింది.

Also read: పాకిస్తాన్‌లో కొనసాగుతున్న ఆలయాల విధ్వంసం

Also read: దుబ్బాక విజయంలో ఆ వర్గాలే కీలకం

Latest Articles