Helicopter Crash Video: బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి కొన్ని సెకెన్ల ముందు.. వీడియో రికార్డ్ చేసిన టూరిస్టులు..

ఎంఐ-17వి5 లో సిడిఎస్ బిపిన్ రావత్ ప్రయాణం. తమిళనాడు కున్నూరులో ప్రమాదం. ఆ దృశ్యాలను కొందరు టూరిస్టులు రికార్డ్ చేశారు. నీలగిరి కొండల్లో ఎగురుతున్న Mi17V5 హెలికాప్టర్‌ దృశ్యాలను వారు ముందుగా చూశారు.

Helicopter Crash Video: బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి కొన్ని సెకెన్ల ముందు.. వీడియో రికార్డ్ చేసిన టూరిస్టులు..
Helicopter Crash Video
Follow us
Sanjay Kasula

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 09, 2021 | 6:31 PM

ఎంఐ-17వి5 లో సిడిఎస్ బిపిన్ రావత్ ప్రయాణం. తమిళనాడు కున్నూరులో ప్రమాదం. ఆ దృశ్యాలను కొందరు టూరిస్టులు రికార్డ్ చేశారు. నీలగిరి కొండల్లో ఎగురుతున్న Mi17V5 హెలికాప్టర్‌ దృశ్యాలను వారు ముందుగా చూశారు. చూసిన వెంటనే ప్రమాదం జరుగుతున్నట్లుగా అనుమానంతో వీడియో రికార్డ్ చేశారు. కొందరు టూరిస్టులు నీలగిరి కొండలను క్యాప్చర్ చేస్తుండగా ఈ సీన్ క్యాప్చర్ చెయ్యగలిగారు. అక్కడి పొగమంచు చాలా క్లియర్‌గా కనిపిస్తోంది.. చక్కర్లు కొడుతూ వెళ్లిన హెలికాప్టర్‌ ఒక్కసారిగా మంచులోకి వెళ్లిపోయింది. ఆ వెంటనే పెద్ద శబ్దం వచ్చింది. అప్పటికే క్యాప్చర్ చేస్తున్న వాళ్లు ప్రమాదం జరిగిందని గ్రహించారు. అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు.

కోయంబత్తూరు ATC నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. ప్రమాదానికి కాసేపటికి ముందు కంట్రోల్‌ రూమ్‌తో సంబంధాలు తెగిపోయాయి. అదే టైమ్‌లో పొగమంచుతో కూడిన మేఘాలు కమ్మేశాయి. ముందుకు వెళ్తున్న హెలికాప్టర్‌కు ఎదురుగా ఉన్నది ఏంటో తెలిసే పరిస్థితి లేకపోయింది.

ఫలితంగా కొండల్లో ఉన్న చెట్లను ఢీకొట్టి మంటలతో కూలిపోయింది హెలికాప్టర్‌. ఆ ప్రమాదం జరుగుండగానే ఐదారుగురు మంటలతోపాటే కిందకు దూకేశారని ప్రత్యక్ష సాక్షులూ చెబుతున్నారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తీవ్ర గాయాలు, 90శాతం మేర కాలిన గాయాలతో చనిపోయారు.

ఇవి కూడా చదవండి: Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..

Black Box not yet found: అసలేం జరిగింది..? బ్లాక్‌బాక్స్‌ ఎక్కడా..? ప్రమాద స్థలంలో వెతుకుతున్న అధికారులు..