AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వికసిత్ భారత్ అంబాసిడర్’ ఇదొక ఎమోషన్.. స్మృతి ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు..

స్వాతంత్య్ర వచ్చిన 100 ఏళ్లు అనగా.. 2047 కల్లా.. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు 'వికసిత్ భారత్ 2047'పేరుతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువతను భాగస్వామ్యం చేస్తున్న కేంద్రం..

'వికసిత్ భారత్ అంబాసిడర్' ఇదొక ఎమోషన్.. స్మృతి ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Smriti Irani
Ravi Kiran
|

Updated on: Mar 15, 2024 | 6:35 PM

Share

స్వాతంత్య్ర వచ్చిన 100 ఏళ్లు అనగా.. 2047 కల్లా.. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ‘వికసిత్ భారత్ 2047’పేరుతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువతను భాగస్వామ్యం చేస్తున్న కేంద్రం.. ఇందులో భాగంగానే ‘వికసిత్ భారత్ అంబాసిడర్స్’ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది.

ఈ నేపధ్యంలోనే ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీలో ‘వికసిత్ భారత్ అంబాసిడర్స్’ కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు. మార్చి 7వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 7 వేల మంది మహిళలు హాజరయ్యారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిధిగా హాజరైన ఈ కార్యక్రమంలో మహిళా విద్యార్ధులు దేశంలో ఎలాంటి మార్పును కోరుకుంటున్నారన్నది స్పష్టం చేయడంతో పాటు.. తాము యూనివర్సిటీలలో పడుతున్న ఇబ్బందులను కూడా తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ మహిళా విద్యార్ధి తమకు మరిన్ని హాస్టల్‌లు ఏర్పాటు చేయాలని స్మృతి ఇరానీని కోరింది. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి.. సత్వరమే మరో కొత్త హాస్టల్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినట్టుగానే వారంలోగా కొత్త హాస్టల్‌ను ఏర్పాటు చేశారు.

‘ఎప్పుడైతే దేశంలో మార్పు కోరుకోవాలని ప్రజలు అనుకుంటారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం సత్వరమే పరిష్కారంతో ముందుకొస్తుంది. వికసిత్ భారత్ అంబాసిడర్ – ఇది ఒక ఎమోషన్ మాత్రమే కాదు.. ఇది సత్వరమే ప్రభుత్వం తీసుకునే చర్య. ప్రజాస్వామ్యానికి భరోసా ఇచ్చే మార్పు రాయబారులు!’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు స్మృతి ఇరానీ.