AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Blast: అల్ ఫలా యూనివర్సిటీ నీడలో టెర్రరిస్టులు.. మొత్తం ఆరుగురు డాక్టర్లు అరెస్ట్‌!

Al-Falah University professor Muzamil Shakeel arrested in Faridabad: అల్ ఫలా యూనివర్సిటీలో పని చేస్తున్న మొత్తం ఆరుగురు జూనియర్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 నుంచి MBBS కోర్సులు అందిస్తున్న అల్ ఫలా యూనివర్సిటీ లో చదువుతున్నవారిలో 40 శాతం కాశ్మీరీలు ఉండటం విశేషం. అల్ ఫలా యూనివర్సిటీలోనే ఎర్ర కోట కారు పేలుడు పాల్పడిన

Delhi Blast: అల్ ఫలా యూనివర్సిటీ నీడలో టెర్రరిస్టులు.. మొత్తం ఆరుగురు డాక్టర్లు అరెస్ట్‌!
Six Doctors At Al Falah University Arrested
Srilakshmi C
|

Updated on: Nov 11, 2025 | 7:37 PM

Share

ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు దర్యాప్తులో కీలక పరిణామం. అల్ ఫలా యూనివర్సిటీలో పని చేస్తున్న ఆరుగురు జూనియర్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 నుంచి MBBS కోర్సులు అందిస్తున్న అల్ ఫలా యూనివర్సిటీ లో చదువుతున్నవారిలో 40 శాతం కాశ్మీరీలు ఉండటం విశేషం. అల్ ఫలా యూనివర్సిటీలోనే ఎర్ర కోట కారు పేలుడు పాల్పడిన డాక్టర్ ఉమర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఎర్ర కోట కారు పేలుడు ఘటనపై ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖకు ప్రాధమిక దర్యాప్తు నివేదిక అందజేశారు. జైష్ ఏ మహమ్మద్ ఉగ్ర సంస్థకు ఫరీదాబాద్ డాక్టర్లకు ఉన్న సంబంధాలు, జమ్ముకశ్మీర్ పోలీసుల దర్యాప్తు అంశాలను జోడిస్తూ ఎర్ర కోట కారు పేలుడు ఘటనపై హోంశాఖకు ఢిల్లీ పోలీసులు నివేదిక అందజేశారు. ఇప్పటికే ఎర్ర కోట కారు పేలుడు కేసును హోంశాఖ NIA కి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

అల్ ఫలా యూనివర్సిటీ ఛాన్సలర్‌ అండతోనే ఉగ్ర కార్యకలాపాలా?

ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మారిన అల్-ఫలాహ్ యూనివర్సిటీ ఛాన్సలర్ జవ్వాద్ అహ్మద్ సిద్ధిఖీ పలు ట్రస్ట్‌లకు చీఫ్ ట్రస్టీగా పనిచేస్తున్నాడు. 1995–96 కాలంలో అతని పేరు మీద అనేక కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. వాటిల్లో అల్-ఫలాహ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ LLP, అల్-ఫలాహ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్-ఫలాహ్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్, అల్-ఫలాహ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, అల్-ఫలాహ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, తర్బియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, అల్-ఫలాహ్ ఎనర్జీస్ లిమిటెడ్ అల్-ఫలాహ్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టరై ఉన్నాయి. మిల్లీ గెజిట్‌లోని 2000 నివేదిక ప్రకారం.. అల్-ఫలాహ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో కూడిన ఆర్థిక కుంభకోణానికి సంబంధించి సిద్ధిఖీని అరెస్టు చేశారు. అయితే అప్పటి నుంచి ఈ విషయానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు.

ఇక సిద్ధిఖీ పలు కంపెనీలలో డైరెక్టర్‌గా కూడా ఉన్నాడు. AMLA ఎంటర్‌ప్రైజెస్ LLP, అల్-ఫలాహ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ LLP, MJH డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు డైరెక్టర్‌గా ఉన్నాడు. అలియా సిద్ధిఖీ – అనే ఆయన పేరు ట్రస్టీ జాబితాలో ఉంది. కానీ ఆయన గురించి ఎలాంటి అదనపు సమాచారం బహిరంగంగా అందుబాటులో లేకపోవడం విశేషం. నిజానికి సుఫియాన్ అహ్మద్ సిద్ధిఖీ – అధికారికంగా ట్రస్టీ కాకపోయినా ఆయన MJH డెవలపర్స్‌తో సహా అనేక సంబంధిత కంపెనీలలో డైరెక్టర్‌గా ఉన్నారు. అల్-ఫలాహ్ సంస్థల పేర్లు సారూప్యంగా ఉన్నప్పటికీ, అల్-ఫలాహ్ UK, అల్-ఫలాహ్ చెన్నై, అల్-ఫలాహ్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ (రాయ్‌చూర్, 1975), అల్-ఫలాహ్ ట్రస్ట్ (జమ్మూ) అనే విభిన్న సంస్థలు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. అల్-ఫలాహ్ UK ప్రధానంగా పాకిస్తాన్ మూలానికి చెందినదని చెబుతారు. అల్-ఫలాహ్ చెన్నై మసీదు నిర్మాణం, ఖురాన్ పంపిణీ వంటి మతపరమైన, సామాజిక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. రాయ్‌చూర్, జమ్మూ ట్రస్టుల ట్రస్టీలు అధికార పరిధి కూడా నుహ్‌లోని వాటికి భిన్నంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.