బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముఖ్య నేత సహా ఆరుగురు మావోయిస్టుల మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆరుగురు నక్సలైట్లు మృతి చెందగాచ భద్రతా దళాలతో మావోయిస్టుల ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. రెండు వైపుల నుండి కాల్పులు కొనసాగుతున్నాయి. మరో వైపు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆరుగురు నక్సలైట్లు మృతి చెందగాచ భద్రతా దళాలతో మావోయిస్టుల ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. రెండు వైపుల నుండి కాల్పులు కొనసాగుతున్నాయి. మోదక్‌పాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కందుల్నార్‌కు పశ్చిమాన దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు అనేక మంది మావోయిస్టులను హతమార్చాయి. భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది.
ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హతమైన మావోయిస్టులలో ఒక ఉన్నత స్థాయి కమాండర్ ఉన్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కగార్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కాల్పులు పూర్తిగా ఆగలేదు. ఆ ప్రాంతంలో భారీగా భద్రతా దళాలను మోహరించారు అధికారులు. నక్సల్ వ్యతిరేక ప్రచారంలో భద్రతా దళాల ఈ చర్య ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




