Abhaya Case: సిస్ట‌ర్ అభ‌య కేసు: సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత గెలిచిన న్యాయం.. దోషుల‌కు నేడు శిక్ష ఖ‌రారు

28 సంవ‌త్స‌రాల కింద‌ట సంచ‌ల‌న సృష్టించిన సిస్ట‌ర్ అభ‌య హ‌త్య కేసులో సీబీఐ కోర్టు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఫాద‌ర్ థామ‌స్...

Abhaya Case: సిస్ట‌ర్ అభ‌య కేసు: సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత గెలిచిన న్యాయం.. దోషుల‌కు నేడు శిక్ష ఖ‌రారు
Follow us

|

Updated on: Dec 23, 2020 | 11:38 AM

28 సంవ‌త్స‌రాల కింద‌ట సంచ‌ల‌న సృష్టించిన సిస్ట‌ర్ అభ‌య హ‌త్య కేసులో సీబీఐ కోర్టు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఫాద‌ర్ థామ‌స్ కొట్టూరు, న‌న్ సెఫీని సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం దోషులుగా తేల్చింది. దీంతో నిందితులిద్ద‌రికి ఈనెల 23న సీబీఐ కోర్టు శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నుంది. 1992 మార్చి 27న కొట్టాయంలో సిస్ట‌ర్ అభ‌య హ‌త్య‌కు గురైంది. అయితే సిస్ట‌ర్ అభ‌య‌ను ఫాద‌ర్ థామస్ కొట్టూర్‌, న‌న్ సెఫీ క‌లిసి హ‌త్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది. కాగా,28 ఏళ్ల త‌ర్వాత ఈ హ‌త్య కేసులు తీర్పు వెల్ల‌డైంది. ఈ కేసు విచార‌ణ‌ను 1993లో సీబీఐకి అప్ప‌గించింది. అనంత‌రం సిస్ట‌ర్ అభ‌య హ‌త్య‌కు గురైంద‌ని తేల్చింది.

అయితే అభ‌య ప్ర‌మాద‌వ‌శాత్తు బావిలో ప‌డి మ‌ర‌ణించి ఉండ‌వ‌చ్చ‌ని ముందుగా పోలీసులు భావించారు. కానీ మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త జోమోన్ పుతెన్‌పుర‌క్క‌ల్ ఇది హ‌త్య‌గా అనుమానించి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీంతో కేసు విచార‌ణ‌ను 1993లో సీబీఐకి అప్ప‌గించింది. సిస్ట‌ర్ అభ‌య హ‌త్య‌కు గురైన‌ట్లు సీబీఐ తేల్చింది. ఆమె భుజం, కుడి చెవిపై బ‌ల‌మైన గాయాలైన‌ట్లు సీబీఐ విచార‌ణ‌లో తేలింది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన 12 ఏళ్ల త‌ర్వాత సెయింట్ పియ‌స్ కాన్వెంట్‌లో అధ్యాప‌కులుగా ప‌ని చేస్తున్న ఫాద‌ర్ థామ‌స్ కొట్టార్‌, జోన్ పుత్రుక్క‌యిల్‌తో పాటో మ‌రో క్రైస్త‌వ స‌న్యాసిని సెఫేల‌ను 2008లో సీబీఐ అరెస్టుచేసింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే..1992లో సిస్ట‌మ్ అభ‌య (21) కేర‌ళ‌లోని బీఎంసీ క‌ళాశాల‌లో సైకాల‌జీ కోర్టు చేస్తోంది. ఆ స‌మ‌యంలో ఆ క‌ళాశాల‌లో థామ‌స్ కొట్టూరు సైకాల‌జీ అధ్యాప‌కుడిగా విధులు నిర్వ‌హిస్తున్నాడు. అయితే అదే సంవ‌త్స‌రం మార్చి 27న తెల్ల‌వారుజామున 4:20 గంట‌ల‌కు సిస్ట‌ర్ అభ‌య త‌న హాస్టల్ నుంచి కిచెన్ వైపు వెళ్లింది. కిచెన్ వద్ద ఓ క్రైస్త‌వ స‌న్యాసినితో థామ‌స్ కొట్టూరు, జోన్ పుత్రుక్క‌యిల్ అక్ర‌మ సంబంధ వ్య‌వ‌హారాన్ని చూసిన‌ అభ‌య.. ఒక్క‌సారిగా షాక్ గురైంది. ఈ విష‌యం బ‌య‌ట తెలిసిపోతుందేమోన‌న్న భ‌యంతో వారు అభ‌య‌ను హ‌త్య చేసి శ‌వాన్ని ఓ బావిలో ప‌డేశాడు.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోలీసుల ద‌ర్యాప్తులు ఎన్నో కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అభ‌య త‌ల్లిదండ్రులు కూడా త‌మ‌కు న్యాయం జ‌ర‌గాల‌ని పోరాటం కొన‌సాగించారు. న్యాయం కోసం ఎదురు చూస్తున్న త‌ల్లిదండ్రులు నాలుగేళ్ల కింద‌ట‌నే మ‌ర‌ణించారు. పూర్తి ఆధారాలు సేక‌రించిన సీబీఐ ఎట్ట‌కేల‌కు దోషులుగా నిర్ధారించింది.

ముందుగా ముగ్గురిపై కేసు న‌మోదు

ఈ కేసులో ముందుగా సీబీఐ ముగ్గురిపై కేసు న‌మోదు చేయ‌గా, నిందితుల్లో ఒక‌రైన ప‌త్రుక్క‌యిల్‌ను 2018లో కోర్టు నిర్ధోషిగా ప్ర‌క‌టించింది. మిగ‌తా ఇద్ద‌రి డిశ్చార్జ్ పిటిష‌న్ల‌ను తిర‌స్క‌రించింది.

ఈ కేసుల ఇన్నేళ్లు ప‌ట్ట‌డంతో ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక ఈ కేసు నుంచి త‌ప్పించుకునేందుకు ఫాద‌ర్ కొట్టూరు, న‌న్ సెఫీలు తీవ్రంగా ప్ర‌య‌త్నించినా సీబీఐ ముందు వారి ఎత్తుగ‌డ‌లు ఏ మాత్రం పార‌లేదు. వీరిద్ద‌రినీ తాజాగా జ‌రిగిన విచార‌ణలో దోషులుగా నిర్ధారించిన తిరువ‌నంత‌పురం సీబీఐ ప్ర‌త్యే కోర్టు నేడు శిక్షలు ఖ‌రారు చేయ‌నుంది. కాగా, సీబీఐ కోర్టు తీర్పు అనంత‌రం మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త జోమ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కేసు విచార‌ణ ఇంత కాలం ప‌ట్టినా.. చివ‌రికి బాధితురాలికి న్యాయం జ‌రిగింద‌ని అన్నారు.

Gas Leakage at IFFCO: ఉత్తర్‌ప్రదేశ్‌లో గ్యాస్ లీకేజీ… ఇద్దరు మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం…