మధ్యప్రదేశ్ లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం.. తెల్లవారు జామున భూ ప్రకంపనలు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్(Indore) లో స్వల్ప భూకంపం(Earth Quake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5 గా నమోదైంది. భూమి కంపించడంతో ప్రాణభయంతో
ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. గురువారం ఉదయం 4.53 గంటలకు భూ ప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమచారం. ఇండోర్‌కు 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.
Also Read
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా.. కైవ్, ఖార్కివ్‌లో భీకర దృశ్యాలు
Booster Dose: బూస్టర్ డోసుతోనే ఒమిక్రాన్‌కు అడ్డుకట్ట వేయవచ్చు.. తాజా పరిశోధనలలో వెల్లడి
Breakup: లవ్‌లో ఫెయిల్ అయిన అబ్బాయిలు ఈ పనులే ఎక్కువగా చేస్తున్నారట..!