Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: నాకూ గౌహతి నుంచి ఆఫర్ వచ్చింది.. శివసేన లీడర్ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్

తీవ్ర ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయి ఏక్ నాథ్ శిండే నేతృత్వంలో కొత్త సర్కార్ కొలువుదీరింది. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ ...

Maharashtra: నాకూ గౌహతి నుంచి ఆఫర్ వచ్చింది.. శివసేన లీడర్ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్
Shiv Sena Mp Sanjay Raut (File Photo)
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 02, 2022 | 6:22 PM

తీవ్ర ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయి ఏక్ నాథ్ శిండే నేతృత్వంలో కొత్త సర్కార్ కొలువుదీరింది. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకూ గౌహతి (Gowhathhi) నుంచి ఆఫర్ వచ్చిందని, కానీ దానిని తాను వ్యతిరేకించానని చెప్పారు. తాను బాలాసాహెబ్‌ అడుగుజాడల్లో నడుస్తానని.. అందుకే అటువైపు వెళ్లలేదన్నారు. మరోవైపు.. ఆయనపై శుక్రవారం జరిగిన ఈడీ విచారణపైనా స్పందించారు. ఒక దర్యాప్తు సంస్థ సమన్లు జారీచేస్తే.. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, ఎంపీగా హాజరవడం తన బాధ్యత అని పేర్కొన్నారు. విచారణ సమయంలో అధికారులు తనతో మంచిగానే మెలిగారని, అవసరమైతే మళ్లీ వస్తానని కూడా వారికి చెప్పినట్లు వివరించారు. మహారాష్ట్రలో ఓ పక్క అధికార శివసేన (Shivasena) శాసనసభ్యులు తిరుగుబాటు చేయడం, మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది.

ఇదిలా ఉండగా ఐటీ శాఖ నుంచి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు శుక్రవారం నోటీసులు అందాయి. 2004, 2009, 2014, 2020 ఎన్నికల అఫిడవిట్లలో శరద్ పవార్ చూపిన ఆస్తులకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ఐటీ శాఖ ఆయనకు నోటీసులు పంపింది. ఐటీ శాఖ నుంచి తనకు ‘లవ్ లెటర్’ అందిందంటూ శరద్ పవార్ వెల్లడించారు. ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్న ఫలితం ఏంటో అందరికీ తెలుసన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి మహరాష్ట్ర ఎమ్మెల్యేలకు నోటీసులు అందుతున్నాయన్నారు.

ఈడీ అంటే ఏంటో ఐదేళ్ల క్రితం వరకు ఎవరికీ తెలిసేది కాదని.. ఇప్పుడు గ్రామస్థుల కూడా ఈడీ గురించి మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీని వాడుకోవడం కొత్త వ్యవహారమన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. 97 మంది మావోయిస్టుల లొంగుబాటు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. 97 మంది మావోయిస్టుల లొంగుబాటు..