Watch Video: ఇలాగేనా భోజనం పెట్టెది.. క్యాటరింగ్‌ మేనేజర్‌ చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్

కూలీలకు మధ్యాహ్న భోజనాన్ని నాసిరకంగా అందిస్తున్నారనే కారణంతో కేటరింగ్ మేనేజర్‌‌ను బండబూతులు తిడుతూ.. చేయిచేసుకున్నారు. కార్మికులకు అందిస్తున్న ఆహారం నాణ్యత బాగా లేదని ఆయన మండిపడ్డారు.

Watch Video: ఇలాగేనా భోజనం పెట్టెది.. క్యాటరింగ్‌ మేనేజర్‌ చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Maharashtra
Follow us

|

Updated on: Aug 16, 2022 | 3:59 PM

MLA Santosh Bangar Slaps Catering Manager: మహారాష్ట్రలో అధికారం చేపట్టిన తరువాత శివసేన షిండే వర్గం ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. హింగోలిలో ఎమ్మెల్యే సంతోష్ బంగర్ ఓ క్యాటరింగ్‌ మేనేజర్‌ చెంప చెల్లుమనిపించారు. కూలీలకు మధ్యాహ్న భోజనాన్ని నాసిరకంగా అందిస్తున్నారనే కారణంతో కేటరింగ్ మేనేజర్‌‌ను బండబూతులు తిడుతూ.. చేయిచేసుకున్నారు. కార్మికులకు అందిస్తున్న ఆహారం నాణ్యత బాగా లేదని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కింద కార్మిక శాఖలో నమోదు చేసుకున్న కార్మికులకు ఆహారం పంపిణీ చేస్తుంది. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్‌ను సంబంధిత డిపార్ట్‌మెంట్ ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు ఇచ్చింది. ఆ కాంట్రాక్ట్ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని తయారు చేసి హింగోలి నగరంలోని కార్మికులు పంపిణీ చేయాలి. అయితే ఆ ఆహారం నాసిరకంగా ఉంటుందని ఫిర్యాదులు అందాయి. దాంతో ఆహారాన్ని తయారు చేసే కేంద్రానికి ఎమ్మెల్యే సంతోష్ బంగర్ వెళ్లి.. పరిశీలించారు. అయితే ఆహారం నాణ్యతపై మేనేజర్‌ను ప్రశ్నించారు. ఆ క్రమంలో మేనేజర్‌పై చేయిచేసుకున్నారు.

కార్మికులకు అందించే ఆహారంపై తనకు ఫిర్యాదు అందిందని, అందుకే స్వయంగా పరిశీలించేందుకు వెళ్లానని బంగర్ చెప్పారు. అయితే కార్మికులకు ప్రభుత్వం సూచించిన మెనూ అమలుకావడం లేదని చెప్పారు. అయితే మేనేజర్‌పై చేయిచేసుకున్న వీడియోపై దుమారం చెలరేగింది. ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో..

కలమ్నూరి నియోజకవర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే జులైలో మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు కొన్ని నిమిషాల ముందు షిండే క్యాంపులో చేరారు. అంతకుముందు షిండే శిబిరంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాక్రే దగ్గరకు రావాలంటూ ఏడుస్తూ సూచించారు. అప్పట్లో కూడా దీనికి సంంబంధించిన వీడియో నెట్టంట వైరల్ అయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..