AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga Predictions: భారత్‌కు ఆ ముప్పు తప్పదా? భయపెడుతున్న బాబా వాంగా భవిష్యవాణి.. ఆ రెండూ నిజమవడంతో..

Baba Vanga Predictions: బల్గేరియాకు చెందిన బాబా వాంగా.. భవిష్యవాణి చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు. ఆమె చెప్పిన అనేక అంశాలు నిజరూపం దాల్చడంతో..

Baba Vanga Predictions: భారత్‌కు ఆ ముప్పు తప్పదా? భయపెడుతున్న బాబా వాంగా భవిష్యవాణి.. ఆ రెండూ నిజమవడంతో..
Baba Vanga
Shiva Prajapati
|

Updated on: Aug 16, 2022 | 4:02 PM

Share

Baba Vanga Predictions: బల్గేరియాకు చెందిన బాబా వాంగా.. భవిష్యవాణి చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు. ఆమె చెప్పిన అనేక అంశాలు నిజరూపం దాల్చడంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు లభించింది. చిన్నప్పుడే కంటిచూపును కోల్పోయిన బాబా వాంగాకు.. ఆ దేవుడు భవిష్యత్‌ను చూసే దివ్య శక్తిని ఇచ్చాడని అందరూ విశ్వసిస్తారు. బాబా వాంగా ప్రపంచంలో చోటు చేసుకునే కీలక పరిణామాల గురించి ముందే అంచనా వేసి చెప్పారు. అలా చెప్పిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. ఇక 2022 సంవత్సరంలో ప్రారంభ నెలలకు సంబంధించి 2 అంచనాలు వేశారు. అవి కూడా నిజమయ్యాయి. అలాగే భారతదేశానికి సంబంధించి కూడా ఆమె కీలక అంశాన్ని చెప్పింది. అదే ఇప్పుడు దేశాన్ని కలవరానికి గురి చేస్తుంది.

చెప్పిన 2 విషయాలూ నిజమయ్యాయి.. బాబా వాంగా 2022 సంవత్సరానికి సంబంధించి అనేక విషయాలను ప్రస్తావించారు. వాటిలో 2 ఇప్పటి వరకు నిజమయ్యాయి. మొదటిది ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వరదలు వచ్చే అవకాశం ఉంది అనేది నిజమైంది. రెండవది.. అనేక నగరాల్లో కరువు, నీటి సంక్షోభం. ఈ అంచనాల ప్రకారం.. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియా తూర్పు తీరంలో కుండపోత వర్షాలు కురిశాయి. దీనివల్ల అక్కడ తీవ్ర వరదలు సంభవించాయి. అలాగే పెద్ద నగరాలు కరువు బారిన పడతాయని పేర్కొన్నారు. ఈ అంచనా ఇప్పుడు యూరప్‌లో నిజమైంది. బ్రిటన్, ఇటలీ, పోర్చుగల్ వంటి దేశాలు తీవ్రమైన కరువుతో కొట్టుమిట్టాడుతున్నాయి.

సైబీరియాలో డేంజరస్ వైరస్.. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో చాలా ప్రమాదకరమైన వైరస్‌ విజృంభిస్తుందని బాబా వాంగా తెలిపారు. ఇది ప్రపంచంలో కొత్త ప్రమాదకరమైన వ్యాధిని వ్యాప్తి చేస్తుందని, దీనివల్ల మిలియన్ల మంది ప్రజలు చనిపోతారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

భారతదేశం గురించి.. బాబా వాంగా భారతదేశం గురించి కూడా ప్రస్తావించారు. ఈ సంవత్సరం ప్రపంచంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయట. దీని కారణంగా మిడతల వ్యాప్తి పెరుగుతుంది. పచ్చదనం, ఆహారం కోసం మిడతల తండు భారతదేశంపై దాడి చేస్తాయి. ఇది పంటలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. దేశంలో కరువుకు కారణం అవుతుంది. మరి బాబా వాంగా చెప్పిన ఈ విషయాలు ఎంత వరకు నిజమవుతాయో భవిష్యత్‌లో తేలనుంది. అయితే, బాబా వాంగా చెప్పిన అనేక అంశాలు నిజమవడంతో.. ఇప్పుడు ఈ అంశంపై జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె చెప్పిన అంశం నిజమైతే.. పరిస్థితి ఏంటా? అని భయపడిపోతున్నారు.

ఎవరీ బాబా వాంగా.. బాబా వాంగా అసలు పేరు వంగేలియా పాండేవా గుష్టేరోవా. బల్గేరియాకు చెందిన ఈమె 12 ఏళ్ల వయసులోనే కంటి చూపు కోల్పోయింది. ఆ తర్వాత భవిష్యత్తును చూసేందుకు భగవంతుడు తనకు దివ్య దృష్టిని ఇచ్చాడని, భవిష్యత్‌లో ఇవి జరుగుతాయంటూ అనేక అంశాలను చెప్పుకొచ్చింది బాబా వాంగా. ఈమె 1996లో నిర్యాణం చెందింది. అయితే, బాబా వాంగా తన భవిష్య వాణిని రాతపూర్వకంగా పేర్కొననప్పటికీ.. ఆమె మరణించే వరకు ప్రపంచానికి సంబంధించి 5,079 విషయాన్ని పేర్కొన్నట్లు చెబుతారు. ఇందులో బ్రిటన్ యువరాణి డయానా మరణం, అమెరికాపై 9/11 దాడి, బరాక్ ఒబామా అమెరికా తొలి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం వంటి అనేక అంచనాలు కూడా నిజమయ్యాయి.

నిజం కానివి కూడా ఉన్నాయి.. బాబా వాంగా చెప్పిన పలు అంశాల్లో కొన్ని నిజం అవలేదు. 2016లో ఐరోపాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుందని, అది మొత్తం ఖండాన్ని శాశ్వతంగా ముగించేస్తుందని ఆమె పేర్కొన్నారు. 2010 నుండి 2014 వరకు, ప్రపంచంలో భీకర అణుయుద్ధం జరుగుతుందని, దాని కారణంగా ప్రపంచంలోని చాలా భాగం తుడిచిపెట్టుకుపోతుందని ఆమె అంచనా వేసింది. ఇవేవీ కూడా నిజరూపందాల్చలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..