AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలోనే అక్టోబర్ కోటా టిక్కెట్లు విడుదల.. ఎప్పుడంటే

శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల కలియుగ వైకుంఠవాసుని ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ మేరకు గురువారం ఉదయం 9 గంటలకు టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు దేవస్థానం...

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలోనే అక్టోబర్ కోటా టిక్కెట్లు విడుదల.. ఎప్పుడంటే
Tirumala
Ganesh Mudavath
|

Updated on: Aug 17, 2022 | 6:30 AM

Share

శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల కలియుగ వైకుంఠవాసుని ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ మేరకు గురువారం ఉదయం 9 గంటలకు టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. అక్టోబరు నెలకు సంబంధించిన టిక్కెట్లను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించే రూ.300 టికెట్లను వివిధ స్లాట్లలో ఇవ్వనున్నారు. కాగా.. స్వామివారి (Tirumala) వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని రకాల దర్శనాలు రద్దు చేసింది. కేవలం సర్వదర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులు ఆయా తేదీలను చూసుకొని, టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. వరస సెలవు రోజులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఒకానొక సమయంలో శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం పట్టింది. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కిలోమీటర్ల మేర విస్తరించిన క్యూ లైన్లలోని భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదాలు అందించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 21 వరకు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.

తిరుమలకు భక్తులు పోటెత్తడంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తులు ముందస్తు ప్రణాళికతో బస, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు. అధిక రద్దీ కారణంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు యాత్ర వాయిదా వేసుకోవాలని సూచించారు. తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబరు 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుంది. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్