Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janmashtami 2022: కృష్ణాష్టమిరోజున ఏ రాశివారు ఏ రంగు వస్త్రాలు, నైవేధ్యం సమర్పిస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి..

మీరు కూడా ఆచారాలు, సంప్రదాయాలను అనుసరిస్తూ.. శ్రీకృష్ణుడిని పూజించడానికి సిద్ధంగా ఉంటే..  మీ రాశికి అనుగుణంగా కృష్ణుడికి సమర్పించే నైవేద్యం.. పూజ విధి గురించి తెలుసుకోండి.. 

Janmashtami 2022: కృష్ణాష్టమిరోజున ఏ రాశివారు ఏ రంగు వస్త్రాలు, నైవేధ్యం సమర్పిస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి..
Sri Krishna Janmashtami
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Aug 20, 2022 | 1:53 PM

Janmashtami 2022: శ్రీ కృష్ణ పరమాత్ముడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమి తిథి రోజున జన్మాష్టమి లేదా కృష్ణ అష్టమిగా హిందువులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కృష్ణాష్టమి రోజున ప్రజలు శ్రీకృష్ణుడిని పూజిస్తారు. శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున దేవకి, వసుదేవులకు శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఈ సంవత్సరం, జన్మాష్టమి పండుగ ఆగష్టు 18, 19, 2022 తేదీలలో జరుపుకోనున్నారు. ప్రజలు ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీకృష్ణునికి అనేక రకాలైన నైవేద్యాలను సమర్పిస్తారు. మీరు కూడా ఆచారాలు, సంప్రదాయాలను అనుసరిస్తూ.. శ్రీకృష్ణుడిని పూజించడానికి సిద్ధంగా ఉంటే..  మీ రాశికి అనుగుణంగా కృష్ణుడికి సమర్పించే నైవేద్యం.. పూజ విధి గురించి తెలుసుకోండి..

మేషం రాశి (మార్చి 21 – ఏప్రిల్ 19) జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి.. ఈ రాశివారు సంప్రదాయం ప్రకారం పూజలు చేయాలి. అయితే ఈ రాశికి చెందిన వారు పటిక బెల్లం, దానిమ్మ పండ్లను నైవేద్యంగా పెడితే మంచిది. మీరు ఎర్రటి వస్త్రాన్ని ఉపయోగించి శ్రీకృష్ణుని విగ్రహాన్ని అలంకరించాలి.

వృషభం (ఏప్రిల్ 20 – మే 20) శ్రీకృష్ణుడికి ముఖాన్ పండ్లు అంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి, మీరు ఈ రాశికి చెందినవారైతే, మీరు శ్రీకృష్ణుడికి మఖాన్  పండ్లు సమర్పించండి. అంతేకాదు ఒలిచిన లిచీలు, అరటిపండు మొదలైన తెల్లటి పండ్లను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. కొబ్బరి లడ్డూలు, ఇతర తెల్లని స్వీట్లను అందించవచ్చు.

ఇవి కూడా చదవండి

మిథునం (మే 21 – జూన్ 20) ఈ రాశిచక్రం అధిపతి బుధుడు. ఆకుపచ్చ రంగు ప్రియమైనది. కనుక ఈ రాశికి చెందిన వారు శ్రీకృష్ణునికి ఆకుపచ్చ రంగు వస్తువులను సమర్పించాలి. మీరు శ్రీకృష్ణుడిని ఆకుపచ్చని వస్త్రాలు, ఆకులు, నెమలి ఈకలతో అలంకరించవచ్చు. మీరు అతనికి ఆకుపచ్చ పండ్లను నైవేద్యంగా సమర్పించవచ్చు.

కర్కాటకం (జూన్ 21 – జూలై 22) చంద్రుడు ఈ రాశికి అధిపతి. చంద్రుడు తెలుపు రంగుకి చిహ్నం. ఈ రాశికి చెందిన వారు పాలు, వెన్న , అరటిపండును సమర్పించాలి. మీరు కృష్ణుడిని తెలుపు,  వెండి రంగులో కూడా అలంకరించవచ్చు.

సింహ రాశి (జూలై 23 – ఆగస్టు 22) ఈ రాశికి సూర్యుడు అధినేత. ఈ రాశికి చెందిన వారు ఎరుపు రంగు పండ్లు, పువ్వులు, వస్త్రాన్ని సమర్పించాలి. మీరు కృష్ణుడికి  యాపిల్, దానిమ్మ, మొదలైన వాటిని ఉపయోగించి తయారు చేసిన స్వీట్స్ ను అందించవచ్చు. నెయ్యిని కూడా సమర్పించవచ్చు.

కన్య రాశి (ఆగస్టు 23 – సెప్టెంబర్ 22) ఈ రాశికి చెందిన వారు శ్రీకృష్ణునికి ఆకుపచ్చ రంగు నైవేద్యాలు సమర్పించాలి. ఉదాహరణకు, మీరు ఆకుపచ్చ బట్టలు, పండ్లు మొదలైనవాటిని అందించవచ్చు. అంతేకాదు బాల గోపాలానికి వెన్నతో చేసిన స్వీట్లను సమర్పించవచ్చు.

తులారాశి (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) తులారాశికి చెందిన వారు జన్మాష్టమి నాడు శ్రీకృష్ణునికి తెల్లటి రంగు దుస్తులు, ఇతర వస్తువులను సమర్పించాలి. ఉదాహరణకు, మీరు తెలుపు స్వీట్లు, పెరుగు, నెయ్యి అందించవచ్చు. ఇవి శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి, అతని ఆశీర్వాదాలను పొందడంలో మీకు సహాయపడతాయి.

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఈ రాశిలో జన్మించిన వారు ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఎరుపు రంగును ధరించడమే కాకుండా.. కృష్ణుడికి  ఎరుపు రంగు పండ్లు, పువ్వులను సమర్పించాలి. ఆపిల్, దానిమ్మ, పుచ్చకాయలను అందించవచ్చు. అంతేకాదు ఆపిల్,  వెన్నతో పాటు పటిక బెల్లంను కూడా సమర్పించాలి.

ధనుస్సు రాశి (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఈ రాశివారు కృష్ణాష్టమికి శ్రీకృష్ణునికి పసుపు రంగు దుస్తులు, పువ్వులు సమర్పించాలి. పసుపు మిఠాయిలు, పసుపు రంగు ఆహారపదార్ధాలను కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. చందనం పొడిని ఉపయోగించి కృష్ణ విగ్రహాన్నీ అలంకరించవచ్చు.

మకర రాశి (డిసెంబర్ 22 – జనవరి 19) ఈ రాశికి చెందిన వారు కృష్ణాష్టమి రోజున ఎరుపు , పసుపు రంగుల దుస్తులను ధరించాలి. మీరు శ్రీకృష్ణుడికి నైవేద్యాన్ని,  మిస్రీని సమర్పించాలి.

కుంభ రాశి (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈ రాశివారు శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే.. జన్మాష్టమి రోజున ఆయన ఆశీర్వాదం పొందాలని ప్రయత్నిస్తుంటే, మీరు అతనికి నీలిరంగు దుస్తులను సమర్పించాలి. దీనితో పాటు, మీరు ఈ రోజున శ్రీకృష్ణునికి పెరుగు బాదుషాని నైవేద్యంగా సమర్పించాలి.

మీన రాశి (ఫిబ్రవరి 19 – మార్చి 20) జన్మాష్టమి రోజున ఈ రాశివారు శ్రీకృష్ణునికి పండ్లను నైవేద్యంగా సమర్పించడం వలన మీ జీవితంలో అదృష్టాన్ని, శాంతిని పొందవచ్చు. మీరు ఈ రోజున పసుపు బట్టలు ధరించాలి. లడ్డూలు వంటి పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. పసుపు రంగు పండ్లను కన్నయ్యకు సమర్పించవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..