పబ్లిక్‌గా ఇదేం పాడు పని ఎమ్మెల్యే సాబ్! ఆశీర్వాద్ యాత్రలో మహిళా నేతకు ప్రకాష్‌ సర్వే ముద్దులు?

Shiv Sena MLA Prakash Surve: దహిసర్‌లో ఆశీర్వాద్ యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ ర్యాలీలో పార్టీ మహిళా నేతను ఎమ్మెల్యే ప్రకాష్‌ సర్వే పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైంది.

పబ్లిక్‌గా ఇదేం పాడు పని ఎమ్మెల్యే సాబ్! ఆశీర్వాద్ యాత్రలో మహిళా నేతకు ప్రకాష్‌ సర్వే ముద్దులు?
Mla Prakash Surve
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 12, 2023 | 7:16 PM

మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యే ప్రకాష్‌ సర్వే చిక్కుల్లో పడ్డారు. దహిసర్‌లో ఆశీర్వాద్ యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ ర్యాలీలో పార్టీ మహిళా నేతను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఎమ్మెల్యే బుగ్గ మీద.. పార్టీ అధికార ప్రతినిధి షీతల్‌ మహత్రే ముద్దాడినట్లు కనిపిస్తుంది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ర్యాలీకి శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వే, పార్టీ అధికార ప్రతినిధి శీతల్ మహత్రే హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రకాష్‌తో పాటే ఆమె కూడా వాహనం మీద ఉన్నారు. ఆయన పక్కనే నిలబడి ఉన్న షీతల్‌‌ మహత్రే ఉన్నట్టుండి ఎమ్మెల్యే వైపు తిరిగింది. ఆ సమయంలో రెండుసార్లు కిందకు వంగిన ఎమ్మెల్యేను మహిళా నేత ముద్దు పెట్టుకున్నట్లు, ఆమె వైపు చూస్తూ నవ్వడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

దీంతో ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వీడియోపై ఎమ్మెల్యే స్పందించారు. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో ఫేక్‌ అని తేల్చారు. తన పరువు తీసేందుకు, రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి వీడియోను మార్ఫింగ్‌ చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. అంతేగాక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ వ్యవహారంపై శీతల్ మహత్రే స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు ఇంత నీచానికి దిగజారుతారా అని ఆమె మండిపడుతున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి