PM Modi Security Breach: ఎందుకంత నిర్లక్ష్యం.. ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లలో లోపం ఘటనపై పంజాబ్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ..

పంజాబ్‌లో 2022 సంవత్సరం ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతలో లోపం విషయం తెరపైకి వచ్చిన తరువాత దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

PM Modi Security Breach: ఎందుకంత నిర్లక్ష్యం.. ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లలో లోపం ఘటనపై పంజాబ్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ..
Pm Modi's Security
Follow us

|

Updated on: Mar 12, 2023 | 6:34 PM

గతేడాది జనవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతలో లోపం ఏర్పడిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా పంజాబ్ ప్రభుత్వం నుంచి వివరణాత్మక నివేదికను కోరింది. నిజానికి, ప్రధానమంత్రి భద్రతలో లోపానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవడంలో జాప్యానికి సంబంధించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చర్య తీసుకున్న నివేదికను కోరింది. ఈ విషయమై కేంద్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శితో కూడా మాట్లాడారు.

ప్రధానమంత్రి భద్రతలో లోపంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ కమిటీకి నివేదిక సమర్పించి 6 నెలలైంది. ఈ నివేదికలో, ప్రధానమంత్రి భద్రతలో లోపానికి అప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిరుధ్ తివారీ, పోలీసు చీఫ్ ఎస్ ఛటోపాధ్యాయ, ఇతర ఉన్నతాధికారులు బాధ్యులని పేర్కొంది. దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పంజాబ్ చీఫ్ సెక్రటరీ విజయ్ కుమార్ జంజువాను చర్య తీసుకున్న నివేదికను సమర్పించాలని కోరారు.

నివేదికలో ఏముంది?

ఈ నివేదికలో, పంజాబ్ పోలీసు అధికారులు నిర్లక్ష్య వైఖరికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సంఘటన ప్రణాళిక, సమన్వయంలో ఘోర వైఫల్యంగా అభివర్ణించారు. పంజాబ్‌లో ప్రధాని మోదీ భద్రత విషయంలో జాప్యం జరిగిన సమయంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, చరణ్‌జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రిగా ఉన్నారని ఇక్కడ తెలుసుకోవాలి.

ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా వైఫల్యంపై- విచారణను నిలిపివేయాలంటూ ఈమధ్య న్యాయవాదులను బెదిరించిన- సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్త.., విచారణ కమిటీ ఛైర్మన్‌జస్టిస్ ఇందూ మల్హోత్రాను బెదిరిస్తూ ఓ ఆడియోను విడుదల చేయడం కలకలం రేపింది. ఆ విషయాన్ని ధర్మాసనం దృష్టికీ తీసుకెళ్లింది సుప్రీం కోర్టు న్యాయవాదుల సంఘం.

మరిన్ని జాతీయ వార్తల కోసం