వ్యాక్సినేషన్ ముమ్మరానికి రాష్ట్రాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలను తగ్గించిన సీరం కంపెనీ, డోసు ఎంతంటే ?
రాష్ట్రాలకు తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను తగ్గిస్తున్నట్టు సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా ప్రకటించారు. ఇకపై డోసు 300 రూపాయలకు విక్రయిస్తామని ఆయన అన్నారు.

రాష్ట్రాలకు తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను తగ్గిస్తున్నట్టు సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా ప్రకటించారు. ఇకపై డోసు 300 రూపాయలకు విక్రయిస్తామని ఆయన అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రాలకు డోసు 400 రూపాయలకు అముతున్నారు. తమ సంస్థ తరఫున ధరను తగ్గించాలని ఉదారంగా నిర్ణయం తీసుకున్నామని ఆయన ట్వీట్ చేశారు. దీనివల్ల కోట్లాది రూపాయల రాష్ట్ర నిద్జులు ఆదా కాగలవని, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇంకా పెంచవచ్చునని ఆయన తెలిపారు. ఈ సంస్థకు దేశం లోని వివిధ రాష్ట్రాల నుంచి 340 మిలియన్ డోసులు, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి 20 మిలియన్ డోసుల మేర ఆర్దర్లు అందాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఈ వ్యాక్సిన్ ఇంకా కావాలని కోరాయి. రానున్న నాలుగు రోజుల్లో తమ టీకా మందు కొన్ని రాష్ట్రాలకు సప్లయ్ అవుతుందని సీరం సంస్థ వెల్లడించింది. ఈ వారం మహారాష్ట్రతో బాటు 5 రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందనుంది. అయితే ఇతర రాష్ట్రాలకు మూడు వారాల్లో అందే అవకాశం ఉందని ఈ కంపెనీ తెలిపింది
మే 1 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుధ్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టనుంది. మూడో దశ వ్యాక్సినేషన్ కింద 18 ఏళ్ళు, అంతకన్నా వయస్సు పైబడినవారికి టీకామందు ఇవ్వనున్నారు. కాగా ఈ టీకామందును కేంద్రానికి ఒకధర, రాష్ట్రాలకు ఒక ధర నిర్ణయించడమేమిటని విపక్షాలు ఆక్షేపించాయి. దీనిపై స్పందించిన సీరం సంస్థ.. పరిమితంగా కొన్ని డోసుల వరకే ప్రైవేటు ఆసుపత్రులకు డోసు 600 రూపాయలకు విక్రయిస్తున్నట్టు తెలిపింది. అయితే కేంద్రం మాత్రం ఇలా వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థలతో ముందే తాము కుదుర్చుకున్న ఒడంబడిక మేరకు ఈ ధర ఉందని, ఇందులో వివక్షకు తావు లేదని స్పష్టం చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Maruti Suzuki: ఆక్సిజన్ పొదుపు కోసం మారుతి సుజుకీ కీలక నిర్ణయం.. కర్మాగారాలు మూసివేస్తున్నట్లు ప్రకటన
పీఎం కేర్స్ ఫండ్ నుంచి లక్ష పోర్టబుల్ కాన్సెంట్రేటర్లు, 500 ఆక్సిజన్ ప్లాంట్లు, ప్రధాని మోదీ వెల్లడి