Encounter: ఉగ్రవాదులున్న ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు.. వీడియో విడుదల..

జమ్మూ కాశ్మీర్‌లోని పాంపోర్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు దాగి ఉన్న భవనాన్ని భద్రతా దళాలు పేల్చివేశాయి. దీంతో ఇల్లు కూలిపోయి ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు...

Encounter: ఉగ్రవాదులున్న ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు.. వీడియో విడుదల..
Blast
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 17, 2021 | 7:10 PM

జమ్మూ కాశ్మీర్‌లోని పాంపోర్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు దాగి ఉన్న భవనాన్ని భద్రతా దళాలు పేల్చివేశాయి. దీంతో ఇల్లు కూలిపోయి ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. పాంపోర్ ఎన్‌కౌంటర్ సమయంలోనే లష్కరే తోయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖండే హత్యకు గురయ్యాడు. శ్రీనగర్‌లోని బాఘాట్‌లో ఇద్దరు పోలీసు సిబ్బందిని హత్య చేయడం, ఇతర ఉగ్రవాద నేరాలలో ఉమర్ ముస్తాక్ ఖండీ ప్రమేయం ఉన్నట్లు కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. అతను జమ్మూ కాశ్మీర్ పోలీసుల టాప్ 10 టార్గెట్లలో ఒకడు. అక్టోబర్ మొదటి వారంలో లోయను కదిలించిన పౌరుల హత్యల తర్వాత, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి భద్రతా దళాలు తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి. ఉగ్రవాదులను ఎరివేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. తీవ్రవాదులు ఉన్న ఇళ్లను పేల్చడం భద్రతా దళాలు అనుసరించే ఒక వ్యూహం.

గత పది రోజులుగా, భద్రతా దళాలు ఇటువంటి తొమ్మిది ఆపరేషన్లలో పదమూడు మంది ఉగ్రవాదులను హతమార్చాయి. అక్టోబర్ మొదటి వారంలో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన నలుగురు పౌరుల హత్యలకు బాధ్యులైన నలుగురు ఉగ్రవాదులు ఈ తొమ్మిది ఎన్‌కౌంటర్లలో మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సోమవారం నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని మెంధర్‌లో ఉగ్రవాద దాడిలో తొమ్మిది మంది సైనికులు మరణించారు.

Read Also.. Kerala Floods: భారీ వర్షాలతో కకావికలమవుతున్న కేరళ.. పినరయ్ విజయన్‎తో ఫోన్‎లో మాట్లాడిన ప్రధాని మోడీ..