టీచర్ని తాళ్లతో కట్టి.. లాగుతూ.. కొడుతూ.. టీఎంసీ నేత దుర్మార్గం

పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ  నేత ఒకరు ఓ టీచర్ పాలిట రాక్షసుడే అయ్యాడు.  ఆ టీచర్ కు చెందిన భూమిని కబ్జా చేసి, రోడ్డు నిర్మించేందుకు కుట్ర పన్నాడు. స్మృతికోన దాస్ అనే ఆ టీచర్ ఇందుకు అభ్యంతరం చెప్పడంతో.. టీఎంసీ నేత అమల్ సర్కార్ ఆగ్రహంతో రెచ్చిపోయాడు.  అతగాడు పంచాయతీ ఉపాధ్యక్ధుడు కూడా.. ఇక అధికారం ఉంది కదా అని తన అనుచరులతో కలిసి.. స్మృతికోనదాస్ ఇంటికి తన అనుచరులతో […]

టీచర్ని తాళ్లతో కట్టి.. లాగుతూ.. కొడుతూ.. టీఎంసీ నేత దుర్మార్గం

పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ  నేత ఒకరు ఓ టీచర్ పాలిట రాక్షసుడే అయ్యాడు.  ఆ టీచర్ కు చెందిన భూమిని కబ్జా చేసి, రోడ్డు నిర్మించేందుకు కుట్ర పన్నాడు. స్మృతికోన దాస్ అనే ఆ టీచర్ ఇందుకు అభ్యంతరం చెప్పడంతో.. టీఎంసీ నేత అమల్ సర్కార్ ఆగ్రహంతో రెచ్చిపోయాడు.  అతగాడు పంచాయతీ ఉపాధ్యక్ధుడు కూడా.. ఇక అధికారం ఉంది కదా అని తన అనుచరులతో కలిసి.. స్మృతికోనదాస్ ఇంటికి తన అనుచరులతో వెళ్లి.. ఆమె కాళ్ళను తాళ్లతో కట్టేసి.. వీధిలో ఈడ్చుకుంటూ.. కొడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. వారిని అడ్డుకోబోయిన స్మృతి సోదరిని కూడా వారు కిందికి తోసివేశారు. ఈ వీడియో వైరల్ అయింది. వివరాల్లోకి వెళ్తే.. టీచర్ స్మృతికి కొంత భూమి ఉంది. అయితే దానిపై కన్నేసిన అమల్ సర్కార్.. మొదట కేవలం 12 అడుగుల రోడ్డు వేస్తామని చెప్పడంతో ఆమె అందుకు అంగీకరించింది. కానీ.. ఈ రోడ్డు వెడల్పును 12 అడుగులు కాకుండా.. క్రమేపీ 24 అడుగులకు పెంచడంతో స్మృతి అభ్యంతరం చెప్పింది. దాంతో అమల్ ఇలా బరితెగించాడు. చివరకు స్మృతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు అతనిపై కేసు నమోదు చేయలేదని తెలిసింది. కానీ అమల్ ని పంచాయతీ ఉపాధ్యక్ష పదవినుంచి అధికారులు సస్పెండ్ చేశారు.

 

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu