కేరళలో మూడో కరోనా కేసు..ఐసొలేషన్ వార్డుల్లో రోగులు

కేరళలో మూడో కరోనా కేసు నమోదయింది.  తాజా అనుమానిత రోగి కూడా చైనాలోని వూహాన్ సిటీ నుంచి ఈ రాష్ట్రం చేరుకున్న వ్యక్తే.. ఈ రోగిలో వ్యాధికి సంబంధించిన పాజిటివ్ లక్షణాలను గుర్తించారని.. ఈ పేషంటును కంజన్ గఢ్ జిల్లాలోని ఆసుపత్రిలో ఐసొలేషన్ వార్డుకు తరలించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ తెలిపారు. డాక్టర్లు ఎప్పటికప్పుడు  ఈ రోగి ఆరోగ్య  పరిస్థితిని గమనిస్తున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొదట తొలి కేసు […]

కేరళలో మూడో కరోనా కేసు..ఐసొలేషన్ వార్డుల్లో రోగులు

కేరళలో మూడో కరోనా కేసు నమోదయింది.  తాజా అనుమానిత రోగి కూడా చైనాలోని వూహాన్ సిటీ నుంచి ఈ రాష్ట్రం చేరుకున్న వ్యక్తే.. ఈ రోగిలో వ్యాధికి సంబంధించిన పాజిటివ్ లక్షణాలను గుర్తించారని.. ఈ పేషంటును కంజన్ గఢ్ జిల్లాలోని ఆసుపత్రిలో ఐసొలేషన్ వార్డుకు తరలించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ తెలిపారు. డాక్టర్లు ఎప్పటికప్పుడు  ఈ రోగి ఆరోగ్య  పరిస్థితిని గమనిస్తున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొదట తొలి కేసు గత నెల 30 న త్రిసూర్ జిల్లాలో నమోదు కాగా.. రెండవ కేసు అళపుజలో నమోదైనట్టు అధికారవర్గాలు తెలిపాయి. కాగా-గత నాలుగు రోజుల్లో చైనాలో కరోనా వ్యాధికి గురై మరణించిన వారి సంఖ్య 350 కి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వంద నగరాల్లో ‘ కరోనా అలర్ట్’ ప్రకటించారు. పలు దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి.

Click on your DTH Provider to Add TV9 Telugu