AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏఎన్‌యూ విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత..

ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి చెందిన నలుగురు విద్యార్థులపై యాజమాన్యం సస్పెన్షన్ ఎత్తివేసింది. ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేయడంతో మొదట వారిపై వేటు వేశారు. అయితే పలు ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు నుంచి విమర్శలు రావడంతో..యాజమాన్యం వెనకడుగు వేసి సస్పెన్షన్ ఎత్తివేసింది. అసలు ఏం జరిగిందంటే : ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులను అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసనల్లో పాల్గొన్నందుకు వారిని హాస్టల్ […]

ఏఎన్‌యూ విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Feb 03, 2020 | 6:40 PM

Share

ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి చెందిన నలుగురు విద్యార్థులపై యాజమాన్యం సస్పెన్షన్ ఎత్తివేసింది. ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేయడంతో మొదట వారిపై వేటు వేశారు. అయితే పలు ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు నుంచి విమర్శలు రావడంతో..యాజమాన్యం వెనకడుగు వేసి సస్పెన్షన్ ఎత్తివేసింది.

అసలు ఏం జరిగిందంటే :

ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులను అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసనల్లో పాల్గొన్నందుకు వారిని హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. వైస్-ఛాన్సలర్ (ఎఫ్ఎసి) ప్రొఫెసర్ పి రాజశేఖర్ ఆదేశాల మేరకు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అశిర్వాదమ్, నవీన్..ఇంగ్లీష్ విభాగానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రాజు, ఏడుకొండలను హాస్టల్ చీఫ్ వార్డెన్ డాక్టర్ రామచంద్రన్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్న విద్యార్థులు “ప్రభుత్వ వ్యతిరేక చర్యలలో” పాల్గొన్నారని, అందువల్ల వారిని సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. విద్యార్థులను విశ్వవిద్యాలయ క్రమశిక్షణా కమిటీ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. ఈ కమిటీ వారి వివరణ కోరి సస్పెన్షన్ కాలాన్ని నిర్ణయిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా విమర్శలు వెల్లువెత్తడంతో సదరు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేసింది ఏన్‌ఎన్‌యూ యాజమాన్యం.

చర్మ సౌందర్యానికి ఆయుర్వేద వరం.. పొల్యూషన్‌, ఎండ నుంచి రక్షణకు..
చర్మ సౌందర్యానికి ఆయుర్వేద వరం.. పొల్యూషన్‌, ఎండ నుంచి రక్షణకు..
ఓడ ఎక్కబోతే.. దెబ్బకు చుక్కలు కనిపించాయి..!
ఓడ ఎక్కబోతే.. దెబ్బకు చుక్కలు కనిపించాయి..!
కొలంబో పిచ్‌పైనే కోచ్‌ల గురి..టీమిండియా వ్యూహాలు మారుతున్నాయా?
కొలంబో పిచ్‌పైనే కోచ్‌ల గురి..టీమిండియా వ్యూహాలు మారుతున్నాయా?
అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌.. ఎంత డేంజరో తెలుసా?
అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌.. ఎంత డేంజరో తెలుసా?
అందానికి అమ్మ చెప్పిందే చేస్తా! హైదరాబాద్ బ్యూటీ చెప్పిన సీక్రెట్
అందానికి అమ్మ చెప్పిందే చేస్తా! హైదరాబాద్ బ్యూటీ చెప్పిన సీక్రెట్
శివరాత్రి నాడు అరుదైన మహా లక్ష్మీ రాజయోగం.. ఇలా చేస్తే డబుల్ జాక్
శివరాత్రి నాడు అరుదైన మహా లక్ష్మీ రాజయోగం.. ఇలా చేస్తే డబుల్ జాక్
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సోనియా.. వీడియో ఇదిగో
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సోనియా.. వీడియో ఇదిగో
పాత ఇంటిని లగ్జరీ విల్లాగా మార్చేసిన స్టార్ హీరో భార్య..
పాత ఇంటిని లగ్జరీ విల్లాగా మార్చేసిన స్టార్ హీరో భార్య..
నాగ్‌తో సినిమా ఆఫర్‌కు నో చెప్పింది.. ఈ భామ ఎవరో తెలుసా.?
నాగ్‌తో సినిమా ఆఫర్‌కు నో చెప్పింది.. ఈ భామ ఎవరో తెలుసా.?
సంజూ చేసిందేం లేదు..వాడి కంటే వీడే బెటర్ చీఫ్ సెలెక్టర్ కామెంట్స్
సంజూ చేసిందేం లేదు..వాడి కంటే వీడే బెటర్ చీఫ్ సెలెక్టర్ కామెంట్స్