పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు, వార్డుకు పోటీ చేసేవారు ఎంత ఖర్చు చేయొచ్చు..?
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రుల వరకు ఎదిగిన నాయకుల రాజకీయ ప్రయాణాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార ఖర్చుల పరిమితులు, యువతకు అవకాశాలు వంటి అంశాలు ఈసారి స్థానిక ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి.

ఒకప్పుడు ఊర్లో సర్పంచ్గా గెలిచిన నాయకుడు. తర్వాత ఎమ్మెల్యే కావచ్చు. మంత్రి పదవీ చేపట్టవచ్చు. కానీ ఆ ప్రయాణం అంత సులువు కాదు. ప్రజల మధ్య ఉండాలి. వారి సమస్యలపై పోరాడాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అప్పుడే రాజకీయాల్లో ఎదిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏపీలో స్థానిక ఎన్నికల నగారా మోగడంతో పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ కొత్త ఆశలు మొదలయ్యాయి. చిన్న పదవితో మొదలుపెట్టి పెద్ద స్థాయికి ఎదగాలని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. తొలిదశలో 100 పట్టణ స్థానిక సంస్థలకు అక్టోబర్ 28న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఫలితాలు ప్రకటించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో టికెట్ల కోసం ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. చిన్న పదవి..పెద్ద రాజకీయ ప్రయాణం! స్థానిక ఎన్నికలంటే కేవలం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవుల కోసం పోటీ కాదు. ఇవి ప్రజలకు దగ్గరయ్యే అవకాశాలు. గ్రామంలో రోడ్డు వేయించడమైనా, తాగునీటి సమస్య పరిష్కరించడమైనా, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడికి గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపే తర్వాతి రాజకీయ ప్రయాణానికి బలమవుతుంది. దీనికి ఉదాహరణగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని చూడొచ్చు. ఆయన బేతంచెర్ల గ్రామానికి రెండుసార్లు సర్పంచ్గా పనిచేసిన...
