ఇంట్లోనే కమ్మని మటన్ కర్రీ.. హోటల్ రుచిని మించిన గ్రేవీ కోసం ఇలా చేయండి!

Prasanna Yadla

14 october 2026

Pic credit - Pinterest

 మటన్ కర్రీని ఇలా చేస్తే మీ ఇంట్లో వాళ్ళు ఆపకుండా లాగిస్తూ తింటూనే ఉంటారు. ఎలా చేయాలంటే? 

మటన్ కర్రీ

ముందుగా మీరు అరకిలో మటన్‌ తీసుకుని బాగా కడిగి, కొంచం పసుపు, ఇంకా కొద్దిగా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి  మ్యారినేట్ చేయాలి.

 మటన్‌

ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసి అది బాగా వేడి అయినా తరవాత నాలుగు బిర్యానీ ఆకు, లవంగాలు, మూడు యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి.

స్టెప్ 1 

ఇక ఇప్పుడు ఆ తర్వాత సన్నగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలు వేసి దానిని గోల్డ్ కలర్లోకి  వచ్చే వరకు వేయించాలి.

స్టెప్ 2

ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక దీనిని మంచిగా కలపాలి 

స్టెప్ 3

ఇంకా ఇప్పుడు మ్యారినేట్ చేసిన మటన్ వేసి 5 నిమిషాలు ఉంచి  దీనిని లో ఫ్లేవర్ మంటపై బాగా వేయించాలి.

స్టెప్ 4

ఇంకా ఈ మటన్‌లో కొద్దిగా కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలపాలి.

స్టెప్ 5

ఇంకా రెండు టమాటాలు దీనిలో వేసి బాగా మెత్తబడే వరకు వీటిని ఉడికించి, ఈ మసాలాను మటన్‌కు పట్టేలా కలపాలి. తగినంత వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చేలా ఉడికించాలి.

స్టెప్ 6