AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రక్తం తక్కువ ఉన్నవారు రోజుకొక లడ్డూ తినండి.. ఒంట్లో రక్తం ఉరకలేస్తుంది

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనంలో చాలామంది స్త్రీలు, పిల్లలు తీవ్రమైన రక్తహీనత , కాల్షియం కొరతతో అలసట, నీరసం మరియు కీళ్ల నొప్పులను ఎదుర్కొంటున్నారు. వీటికి కృత్రిమ ఐరన్ మాత్రలు వాడేకంటే.. మన సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతుల్లో ప్రకృతి ప్రసాదించిన తెల్ల నువ్వులు మరియు తాటిబెల్లంతో లడ్డూలు చేసుకుని రోజుకు ఒకటి తింటే శరీరంలో రక్తం సమృద్ధిగా పెరుగుతుంది. పాల కంటే నువ్వుల్లోనే క్యాల్షియం మోతాదు ఎన్నో రెట్లు అధికంగా ఉండి ఎముకలను దృఢపరుస్తుంది. అలాగే సాధారణ బెల్లంతో పోలిస్తే తాటిబెల్లంలో ఔషధ గుణాలు, ఐరన్ శాతం చాలా ఎక్కువ.

Phani CH
|

Updated on: Oct 14, 2026 | 6:07 PM

Share
కావలసిన పదార్థాలు: 1 కప్పు తెల్ల నువ్వులు, 1 కప్పు తాటిబెల్లం తురుము, 2 టీస్పూన్ స్వచ్ఛమైన నెయ్యి, పావు టీస్పూన్ యాలకుల పొడి . గమనిక: తియ్యదనం తక్కువగా తినేవారు బెల్లాన్ని కాస్త తగ్గించి వేసుకోవచ్చు; అలాగే నెయ్యి నచ్చని వారు నెయ్యిని పూర్తిగా స్కిప్ చేయవచ్చు.

1 / 5
తయారీ విధానం: స్టవ్‌పై వెడల్పాటి పాన్ పెట్టి ఒక కప్పు తెల్ల నువ్వులను వేయాలి. లో-మీడియం మంటపై గరిటెతో కలుపుతూ వేడిచేయాలి. నువ్వులు కాస్త వేడెక్కిన తర్వాత ఒక టీస్పూన్ నెయ్యి వేసి కలపాలి. నెయ్యి వేయడం వల్ల లడ్డూకు మంచి టేస్ట్ వస్తుంది. మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి నువ్వులు చిటపటలాడి, మంచి ఎర్రటి రంగులోకి మారేంత వరకు దోరగా వేయించాలి. వేగిన వెంటనే నువ్వులను వెడల్పాటి ప్లేట్‌లోకి తీసుకుని సమానంగా పరచి పూర్తిగా చల్లారనివ్వాలి. పాన్‌లోనే ఉంచితే ఆ వేడికి మాడిపోతాయి.

2 / 5
నువ్వులు చల్లారే లోపు.. స్వచ్ఛమైన తాటిబెల్లాన్ని చాకుతో సన్నగా తురుముకోవాలి. నువ్వులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు నిండుగా ఒక కప్పు తాటిబెల్లం తురుమును కొలిచి పక్కన ఉంచుకోవాలి. నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత.. అందులోంచి 3 టేబుల్ స్పూన్ల వేయించిన నువ్వులను తీసి ఒక చిన్న గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇవి లడ్డూ తింటున్నప్పుడు అక్కడక్కడా క్రంచీగా తగులుతాయి. మిగిలిన నువ్వులను మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. మిక్సీని పల్స్ మోడ్‌లో కాస్త పలుకులుగా ఉండేలా బరకగా గ్రైండ్ చేసి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

3 / 5
ఇప్పుడు ఈ నువ్వుల పొడిలో ఒక కప్పు తురిమిన తాటిబెల్లాన్ని వేసి చేత్తో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తిరిగి మిక్సీ జార్‌లో వేసి.. ఆపుతూ ఆపుతూ చేత్తో ముద్ద కట్టే పదం వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న నువ్వులు-తాటిబెల్లం ముద్దను ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇందులో ముందుగా పక్కన పెట్టిన 3 స్పూన్ల వేయించిన నువ్వులు, పావు టీస్పూన్ యాలకుల పొడి, మరియు 1 టీస్పూన్ నెయ్యి వేయాలి.

4 / 5
పిండిని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ ఒకటి రెండు నిమిషాల పాటు ఒత్తుతూ కలపాలి. ఇలా ఒత్తడం వల్ల నువ్వుల్లోంచి సహజమైన ఆయిల్ బయటకు వచ్చి లడ్డూలు చుట్టడానికి తేమ సులభంగా అందుతుంది. ఇప్పుడు కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ అరచేతుల్లో గట్టిగా నొక్కుతూ గుండ్రని లడ్డూల్లా చుట్టుకోవాలి.  అంతే, రక్తాన్ని పెంచి ఎముకలకు పుష్టినిచ్చే సంప్రదాయ 'తాటిబెల్లం నువ్వుల లడ్డూ' సిద్ధం! గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు తాజాగా, కమ్మగా ఉంటాయి !

5 / 5
Follow Us