AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Admission Rules: అక్కడ కొత్తగా పాఠశాలల్లో చేరే విద్యార్థులకు అలర్ట్‌.. అడ్మిషన్స్‌ కోసం కొత్త నియమాలు!

School Admission Rules: ఈ మార్పుల గురించి తల్లిదండ్రులకు స్పష్టంగా తెలియజేయాలని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించింది అక్కడ విద్యాశాఖ. తల్లిదండ్రులు పాఠశాలలు జారీ చేసిన సర్క్యులర్లు, నోటీసులను చదవాలని, వారి పిల్లల అడ్మిషన్‌కు సంబంధించి ఎటువంటి గందరగోళాన్ని నివారించడానికి పాఠశాలలు..

School Admission Rules: అక్కడ కొత్తగా పాఠశాలల్లో చేరే విద్యార్థులకు అలర్ట్‌.. అడ్మిషన్స్‌ కోసం కొత్త నియమాలు!
Subhash Goud
|

Updated on: Nov 06, 2025 | 5:27 PM

Share

School Admission Rules: ఢిల్లీ ప్రభుత్వ విద్యా డైరెక్టరేట్ (DoE) జాతీయ విద్యా విధానం (NEP) 2020కి అనుగుణంగా, ప్రాథమిక దశలో మార్పులు చేసింది. 1వ తరగతిలో ప్రవేశానికి 6+ సంవత్సరాల ఏకరీతి వయస్సును అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మార్పు 2026-27 విద్యా సంవత్సరం నుండి దశలవారీగా అమలు చేయనుంది. తల్లిదండ్రులు ఈ మార్పుల గురించి తెలుసుకోవాలి. తద్వారా వారి పిల్లల అడ్మిషన్ ప్రభావితం కాదు.

ప్రవేశ వయస్సులో మార్పులు:

కొత్త పాఠశాలల్లో చేరే విద్యార్థులు వయస్సు ప్రమాణాలు ఇలా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి
  • నర్సరీ (ప్రీ-స్కూల్ 1): 3 నుంచి 4 సంవత్సరాలు
  • లోయర్ కేజీ (ప్రీ-స్కూల్ 2): 4 నుండి 5 సంవత్సరాలు
  • అప్పర్ కేజీ (ప్రీ-స్కూల్ 3): 5 నుండి 6 సంవత్సరాలు

క్లాస్ 1: 6 నుండి 7 సంవత్సరాలు:

పిల్లల వయస్సు వారు అడ్మిషన్ కోరుతున్న సంవత్సరం మార్చి 31 నాటికి పైన పేర్కొన్న ఫార్ములా ఆధారంగా ఉండాలి.

కొత్త నియమాలు ఎప్పుడు అమలు అవుతాయి?

2026-27 విద్యా సంవత్సరం నుండి కొత్త వయస్సు ప్రమాణాలు దశలవారీగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. 1వ తరగతికి 6+ సంవత్సరాల ఏకరీతి వయస్సు నియమం 2028-29 విద్యా సంవత్సరం నుండి పూర్తిగా అమలు చేయనున్నారు.

ప్రస్తుత విద్యార్థులపై ప్రభావం:

2025-26 విద్యా సెషన్‌లో నర్సరీ, కెజి లేదా 1వ తరగతిలో చేరిన ప్రస్తుత విద్యార్థులకు కొత్త వయస్సు ప్రమాణాలు వర్తించవు. ప్రస్తుతం చేరిన విద్యార్థులందరూ ప్రస్తుత నమూనా ప్రకారం పదోన్నతి పొందుతారు.

వయస్సు సడలింపు నిబంధన:

నర్సరీ నుండి 1వ తరగతి వరకు ప్రవేశానికి కనీస, గరిష్ట వయోపరిమితులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (HoS) ఒక నెల వరకు సడలించవచ్చు.

గుర్తింపు పొందిన ఇతర పాఠశాలల నుండి బదిలీ:

గుర్తింపు పొందిన పాఠశాల నుండి మునుపటి తరగతిలో ఉత్తీర్ణులై, చెల్లుబాటు అయ్యే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (SLC), మార్కుల షీట్ కలిగి ఉన్న విద్యార్థులకు తదుపరి ఉన్నత తరగతిలో ప్రవేశానికి వయో ప్రమాణాల నుండి మినహాయింపు ఉంటుంది.

2026-27 విద్యా సంవత్సరానికి ముఖ్యమైన అంశాలు:

  • నర్సరీలో ప్రవేశం మార్చి 31, 2026 నాటికి 3+ సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  • 2026-27 విద్యా సెషన్‌లో లోయర్ కేజీ, అప్పర్ కేజీ తరగతులు ఉండవు.
  • 2025-26లో నర్సరీ విద్యార్థులు 2026-27లో కేజీకి పదోన్నతి పొందుతారు.
  • 2025-26లో కేజీ విద్యార్థులు 2026-27లో 1వ తరగతికి పదోన్నతి పొందుతారు.
  • మార్చి 31, 2026 నాటికి 4 నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మాత్రమే కేజీకి కొత్త అడ్మిషన్లు ఉంటాయి.
  • 2026 మార్చి 31 నాటికి 5 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మాత్రమే 1వ తరగతికి కొత్త ప్రవేశాలు ఉంటాయి.

లోయర్ కేజీ, అప్పర్ తరగతులు:

  • లోయర్ కేజీ 2027-28 విద్యా సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది.
  • అప్పర్ కేజీ కూడా 2027-28 విద్యా సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది.

ఈ మార్పుల గురించి తల్లిదండ్రులకు స్పష్టంగా తెలియజేయాలని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించింది అక్కడ విద్యాశాఖ. తల్లిదండ్రులు పాఠశాలలు జారీ చేసిన సర్క్యులర్లు, నోటీసులను చదవాలని, వారి పిల్లల అడ్మిషన్‌కు సంబంధించి ఎటువంటి గందరగోళాన్ని నివారించడానికి పాఠశాలలు ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరు కావాలని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే