యూపీలో దారుణం.. రైల్వే ట్రాక్ దాటుతున్న యాత్రికులను ఢీకొన్న రైలు.. ఆరుగురు మృతి
కార్తీక పౌర్ణమి పవిత్ర స్నానాల కోసం గంగానదికి .. ఆ యాత్రికులు రైల్లో బయలుదేరారు. ఈ బృందం చోపాన్-ప్రయాగ్‌రాజ్ లో ఎక్స్‌ప్రెస్ దిగారు. వారు రైలు దిగిన తర్వాత సాధారణంగా ప్రయాణికులు దిగే ప్లాట్‌ఫాం వైపు కాకుండా మరోవైపు ఉన్న పట్టాలపై దిగారు. అక్కడి నుంచి ఎదురుగా ఉన్న ప్లాట్‌ఫాంపైకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. ఊహించని విధంగా అదే ట్రాక్‌పైకి హౌరా ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకొచ్చింది.
వారిని బలంగా ఢీకొట్టింది. యాత్రికులు ట్రాక్ దాటుతున్నప్పుడు రైలు కూత వినిపించకపోవడం, లేదా వారు రైలు వేగాన్ని అంచనా వేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. యూపీలోని మిర్జాపూర్ జిల్లా చునార్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం వైపు కాకుండా పొరపాటున ట్రాక్‌లపై దిగి దాటుతున్న ఆరుగురు మహిళా యాత్రికులను హౌరా-కల్కా నేతాజీ ఎక్స్‌ప్రెస్ అతి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో రైల్వే భద్రతా చర్యల లోపంపై విమర్శలు వస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే భద్రతా దళాలు (RPF), పోలీసులు, స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో అనేక మందికి తీవ్ర గాయాలు అయ్యాయని.. దాని వల్లే మృతుల సంఖ్య పెరిగిందని వైద్యులు తెలిపారు. పండుగ సందర్భంగా జరిగిన ఈ విషాదకర ఘటన మిర్జాపూర్ లో విషాదాన్ని నింపింది. ఘటనపై రైల్వే శాఖ, పోలీసులు విచారణకు ఆదేశించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rain Alert: కొనసాగుతున్న ద్రోణి.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
Gold Price Today: అయ్యో.. బంగారం మళ్లీ పెరిగిందే
AA22: ఏఏ 22 అప్‌డేట్.. బన్నీ కన్ఫార్మ్ చేసినట్టేనా ??
Akshay Kumar: అక్షయ్ డెడికేషన్ గురించి చిన్ని ప్రకాష్ కామెంట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

