Akshay Kumar: అక్షయ్ డెడికేషన్ గురించి చిన్ని ప్రకాష్ కామెంట్
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కెరీర్‌లో తడబడుతున్నారు. ఆయన బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి చాలా కాలం అవుతోంది. వరుస సినిమాలు చేస్తున్నా... సక్సెస్ మాత్రం ఊరిస్తూనే ఉంది. అదే సమయంలో అక్షయ్ సినిమాలకు టైమ్ ఇవ్వటం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి... అక్షయ్ డెడికేషన్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు ఓ టెక్నీషియన్.
ఒకప్పుడు బాలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్, ఈ మధ్య కెరీర్‌లో ఇబ్బందులు పడుతున్నారు. రకరకాల జానర్స్ టై చేస్తున్నా… ఖిలాడీ స్టార్‌కు సక్సెస్ మాత్రం దక్కటం లేదు. దీనికి అక్షయే కారణం అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పీరియాడిక్, హిస్టారికల్ సినిమాల కోసం అక్షయ్ టైమ్ ఇవ్వటం లేదని, మేకోవర్ మీద అస్సలు ఫోకస్ చేయటం లేదన్న విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా ఫెయిల్యూర్ సమయంలో అక్షయ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. తాజాగా అక్షయ్ డెడికేషన్ గురించి ఓ ఇంట్రస్టింగ్ ఇన్సిడెంట్‌ను రివీల్ చేశారు కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్. ఖిలాడీ సినిమా షూటింగ్ టైమ్‌లో ఓ పాట కోసం కోడీ గుడ్లతో కొట్టించుకోవాల్సి వచ్చినా.. అక్షయ్ నో చెప్పలేదని గుర్తు చేసుకున్నారు. ఆ సీన్ చేసిన తరువాత దుర్వాసన వదిలించుకోవడానికి చాలా కష్డపడాల్సి వచ్చినా… కోపగించుకోలేదన్నారు.ఇప్పటికీ అక్షయ్ అంతే డెడికేషన్‌తో వర్క్ చేస్తున్నారన్నారు చిన్ని ప్రకాష్, రీసెంట్‌గా హౌస్‌ఫుల్ సినిమా షూటింగ్ టైమ్‌లోనూ అంతే స్పోర్టివ్‌గా ఉన్నారని, ఆ డెడికేషనే అక్షయ్‌ని ఇంత పెద్ద స్టార్‌ని చేసిందని గుర్తు చేసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. రన్‌వే అవసరం లేని విమానం
టెన్త్ అర్హతతో రైల్వే ఉద్యోగం.. రాత పరీక్ష లేకుండానే
అయ్యో..రక్షించేవారే లేరా.. ఏనుగుల ఆక్రందన
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

