టీచర్లు కాదు.. రాక్షసులు.. బాలుడి ప్యాంటులో తేలును వదిలి ..
హిమాచల్ ప్రదేశ్‌లో ఎస్‌సీ వర్గానికి చెందిన బాలుడి పట్ల ప్రభుత్వ పాఠశాల టీచర్లు పాశవికంగా ప్రవర్తించారు. అతడ్ని ఇష్టమొచ్చినట్టు కొట్టడమేగాక, బాలుడి ప్యాంట్‌లో తేలును వదిలి.. రాక్షసానందం పొందారు. సిమ్లా జిల్లాలోని ఖద్దపాని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో ఈ దారుణం జరిగింది. రోహ్రులో ఎస్సీ వర్గానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు.
స్కూల్ హెడ్‌మాస్టర్ దేవేంద్రతోపాటు మరో ఇద్దరు టీచర్లు దాదాపు ఏడాది కాలంగా బాలుడిని శారీరకంగా వేధిస్తున్నారు. పదేపదే కొట్టడం వల్ల తన కుమారుడి చెవి దెబ్బతిందని బాలుడి తండ్రి తెలిపారు. తమ కొడుకుని పాఠశాలలోని టాయిలెట్‌కు తీసుకెళ్లి, ప్యాంటులో తేలును వదిలారని ఆరోపించారు. ఈ విషయాలు ఎవరికైనా చెబితే బడికి రానీయమని తమ కుమారుడిని హెడ్‌మాస్టర్ బెదిరించాడని.. బాలుడి తండ్రి వాపోయారు. తన కొడుకును కొన్నిసార్లు తుపాకీతో కాల్చేస్తామని కూడా టీచర్లు బెదిరిచారని ఆయన మండిపడ్డారు. తన కుమారుడు చదివే బడిలో.. టీచర్‌గ ఉన్న కృతికా ఠాకూర్ స్థానంలో.. ఆమె భర్త చట్టవిరుద్ధంగా టీచరుగా క్లాసులు తీసుకుంటున్నాడని, అలాగే బడిల కింది కులాల పిల్లల పట్ల తీవ్రమైన వివక్ష ఉందని కూడా బాలుడి తండ్రి చెప్పుకొచ్చాడు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్‌తో పాటు మరో ఇద్దరు టీచర్లపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. స్కూల్లో నేపాలీ, ఎస్‌సీ విద్యార్థులపై కుల వివక్ష చూపుతూ, రాజ్‌పుత్ విద్యార్థుల నుంచి దూరంగా కూర్చోబెడుతున్నారని కూడా తండ్రి ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి గెజిటెడ్ స్థాయి అధికారితో విచారణ జరపాలా? లేదా? అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందని స్థానిక పోలీస్ అధికారి చెప్పారు. అయితే రోహ్రూలో గతంలోనూ టీచర్ల తీవ్రమైన శిక్షలు, కుల వివక్ష మీద ఆరోపణలున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న బాలుడు..ఊహించని విధంగా
పంట నష్టం కింద రైతుకు పరిహారంగా రూ.2.30
భారీ షాక్‌లో డొనాల్డ్ ట్రంప్.. స్వయంగా ప్రచారం చేసినా ఓటమి
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

