పిల్లలను తినేస్తున్న పులి.. పాపం చిన్నారి
పుణే లోని షిరూర్ ప్రాంతంలో చిరుత స్థానికులకు హడలెత్తిస్తోంది. 13 ఏళ్ల రోహన్ అనే బాలుడిని చిరుత చంపేయడంపై స్థానికులు భారీ ఆందోళన చేపట్టారు. అటవీశాఖ కార్యాలయాన్ని , వాహనాలను తగలబెట్టారు. నాసిక్ హైవేను దిగ్భంధించారు. మహారాష్ట్ర పుణే జిల్లా షిరూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిరుత దాడిలో రోహన్‌విలాస్ అనే 13 ఏళ్ల బాలుడు చనిపోయిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తరచుగా చిరుత దాడులు జరుగుతున్నప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి దిగారు. అటవీశాఖ కార్యాలయంతో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు. చిరుత దాడి నుంచి తబను రక్షించాలని నాసిక్ హైవేపై ప్రజలు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గత మూడు నెలల్లో చిరుత దాడిలో ఐదుగురు చనిపోయారని , అయినప్పటికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పొలంలో రోహన్ ఆడుకుంటుండగా తల్లిదండ్రుల ముందే అతడిపై దాడి చేసి చిరుత చంపేసింది. ఈ క్రమంలో బాలుడిని చంపిన చిరుతను కన్పిస్తే కాల్చేయాలని ఫారెస్ట్ సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. చిరుతను కాల్చి చంపడానికి అధికారులు ఐదు షూటర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్థానికులు ప్రకటించారు. గత 25 ఏళ్లలో ఈ ప్రాంతంలో చిరుతల దాడిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ చిరుత జనాభా పెరిగిపోయింది. ఇక్కడ చెరుకు తోటలు ఉన్నాయి. అందుకే చిరుతల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది కూడా పుణేలో చిరుతకు 8 మంది బలైపోయారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శివాలయంలో పునరుద్ధరణ వేళ.. బయటపడిన నిధి
వరదలో కొట్టుకొచ్చిన బంగారు గాజులు.. నూటికో కోటికో ఒకరే అతడిలా
America: ఘోర ప్రమాదం.. టేకాఫ్ అవుతూనే కుప్పకూలింది
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

