America: ఘోర ప్రమాదం.. టేకాఫ్ అవుతూనే కుప్పకూలింది
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. లూయిస్‌విల్లే నగరంలో టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ కార్గో విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధ్రువీకరించింది.
యూపీఎస్‌కు చెందిన కార్గో విమానం లూయిస్‌విల్లే నుంచి హోనులులుకు బయలుదేరింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:15 గంటలకు టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాల్లోకి ఎగురుతున్న సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అదుపుతప్పి కింద పడిపోయింది. మంటల్లో విమానం పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమానం గాల్లో ఉండగానే మంటల్లో చిక్కుకుని కూలిపోతున్న వీడియోలు పలువురిని కలచివేస్తున్నాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మేనమామ చదివింపులే ఏకంగా రూ.1.56 కోట్లు!
Andhra Pradesh: అత్తకు తలకొరివి పెట్టిన ఆదర్శ కోడలు
22 ఏళ్లకే రూ. 8 వేల కోట్ల ఆస్తి అమెరికాలో మనోళ్ల సత్తా ఇదీ
ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన కోతి.. నేరుగా వెళ్లి
తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి.. గదిలో సీన్ చూసి షాక్
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

