AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన కోతి.. నేరుగా వెళ్లి

ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన కోతి.. నేరుగా వెళ్లి

Phani CH
|

Updated on: Nov 06, 2025 | 1:38 PM

Share

పెంపుడు జంతువులు తమ యజమానుల పట్ల ఎంతో ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటాయి. తన యజమానికి నిరంతరం రక్షణగా ఉంటాయి. ఒక్కరోజు తన యజమాని కనిపించకపోయినా తల్లడిల్లిపోతాయి. కానీ ఆరుబయట తిరిగే మామూలు జంతువుల్లో కూడా ఇలాంటి ప్రేమాభిమానాలు ఉంటాయి. కొంచెం ఆప్యాయంగా వాటిని పలకరిస్తూ చాలు వారిపట్ల తమ స్నేహాన్ని ప్రకటిస్తాయి.. అందుకు ఉదాహరణే ఈ వీడియో.

ములుగు జిల్లా ఏటూరునాగారంలోని గిరిజన ఆవాస పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో శనివారం ఉదయం ఉద్యోగులు తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఆ కార్యాలయ ప్రాంగణంలోకి ఓ కోతి వచ్చింది. నేరుగా ఓ ఆఫీసు రూములోకి వెళ్లింది. దాన్ని చూసి అక్కడున్న అందరూ అది తమపై దాడిచేస్తుందేమోనని భయపడ్డారు. దానిని బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ కోతి బెదరకుండా మరింత లోపలికి వచ్చింది. వారిలో మహ్మద్ సాదిక్ అనే ఓ ఉద్యోగి వానరాన్ని చూస్తూ.. ఏం కావాలి? ఏమైనా తిన్నావా? అంటూ దాంతో మాటలు కలిపారు. అలా కాసేపు కోతితో మాట్లాడిన తర్వాత కోతి సాదిక్‌కు మరింత దగ్గరగా వెళ్లి, ఆయన భుజాలపైన కూర్చుంది. అంతటితో ఆగలేదు. అరగంటపాటు అతని తలపై వాలిపోయి హాయిగా నిద్రపోయింది. సాదిక్ కూడా కదలకుండా అలాగే ఉండిపోయారు. సుమారు అరగంట తర్వాత కిందకు దిగిన వానరం సాదిక్ వైపు ఆత్మీయంగా చూస్తూ … నా అలసట తీరింది..ఇక వెళ్లొస్తాను.. అన్నట్టుగా బయటకు వెళ్లిపోయింది. ఇదంతా చూసి సిబ్బంది ఆశ్చర్యపోయారు. మూగజీవిపట్ల సాదిక్‌ చూపించిన ఆదరణ అక్కడివారిని ఆకట్టుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి.. గదిలో సీన్‌ చూసి షాక్‌

ఏ క్షణమైనా యుద్ధంలోకి అమెరికా

9 జిల్లాల్లో పిడుగులు.. ఐఎండీ హెచ్చరికలు