తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి.. గదిలో సీన్ చూసి షాక్
ఒక్కోసారి ఇంట్లో ఊహించని ఘటనలు ఎదురవుతాయి. నిత్యం మనుషులు తిరుగుతూ సందడిగా ఉండే ఇంట్లోకి ఎక్కడో అడవుల్లో ఉండాల్సిన కొండచిలువలు, పాములు కనిపిస్తే.. ఒక్కసారి ఊహించుకోండి. భయంతో వణుకుపుడుతుంది కదూ. అలాంటి ఘటనే జరిగింది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామ సమీపంలో ఉన్న వెంచర్లో గత కొంతకాలంగా సముద్రాల అంజయ్య, గొర్రెలను కాస్తు జీవనం సాగిస్తున్నాడు.
రోజు మాదిరిగానే శనివారం యధావిధిగా వెంచర్లోకి వెళ్లాడు. అక్కడ ఓ గదిలో వింత శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని లోపలికి వెళ్లిన అతను అక్కడ ఓ పెద్ద కొండ చిలువ చుట్టలా చుట్టుకొని ఉండటం గమనించాడు. దెబ్బకు భయంతో బయటకు పరుగులు తీశాడు. గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తక్షణం అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు రెండు గంటలపాటు శ్రమించి కొండచిలువను బంధించారు. అనంతరం ఓ వేసుకొని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లివదిలిపెట్టడంతో గ్రామస్థులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Follow Us
వైరల్ వీడియోలు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

