వరదలో కొట్టుకొచ్చిన బంగారు గాజులు.. నూటికో కోటికో ఒకరే అతడిలా
వరంగల్ కార్పొరేషన్ పరిధిలో రఘు అనే పారిశుధ్య కార్మికుడు రాంపూర్ - మడికొండ మధ్య పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్నాడు.. వర్షాలు, వరదల వల్ల సంభవించిన బురద, వ్యర్ధాలను క్లీన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బంగారు గాజులు దొరికాయి. వాటి విలువ సుమారు ఆరు లక్షల వరకు ఉంటుంది. 6 లక్షల రూపాయల విలువ చేసే బంగారు గాజులు నడిరోడ్డుపై చెత్తలో దొరికితే ఎవరైనా ఏం చేస్తారు..
వరంగల్ కార్పొరేషన్ పరిధిలో రఘు అనే పారిశుధ్య కార్మికుడు రాంపూర్ – మడికొండ మధ్య పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్నాడు.. వర్షాలు, వరదల వల్ల సంభవించిన బురద, వ్యర్ధాలను క్లీన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బంగారు గాజులు దొరికాయి. వాటి విలువ సుమారు ఆరు లక్షల వరకు ఉంటుంది. 6 లక్షల రూపాయల విలువ చేసే బంగారు గాజులు నడిరోడ్డుపై చెత్తలో దొరికితే ఎవరైనా ఏం చేస్తారు.. పండుగ చేసుకుంటారు.. కానీ వరంగల్ కు చెందిన ఆ మున్సిపల్ కార్మికుడు బంగారు గాజులు దొరికిన వెంటనే ఎగిరి గంతెయలేదు.. తన నిజాయితీని చాటుకుని వెంటనే ఆ గాజులను తీసుకెళ్లి తన పై అధికారులకు చూపించాడు.. అక్కడి నుంచి ఆ గాజులను తీసుకెళ్లి GWMC కమిషనర్ చాహత్ బాయ్ పాయ్ కి సమాచారం అందించాడు.. కమిషనర్ ఆదేశాల మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆ గాజులను అప్పజెప్పారు. వర్షాలు వరదల సమయంలో ఎవరైనా బంగారు గాజులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే.. ఆ గాజుల తాలూకు బిల్లు, సరైన వెయిట్ ఆధారాలతో వస్తే తిరిగి ఆ గాజులు అప్పగిస్తామని మున్సిపల్ కమిషనర్, పోలీస్ సిబ్బంది తెలిపారు.. సుమారు 6 లక్షల రూపాయల విలువగల బంగారు గాజులను నిజాయితీగా అప్పజెప్పిన పారిశుద్ధ్య కార్మికుడు రఘును ప్రతీ ఒక్కరూ అభినందించారు.. ఆ బంగారు గాజుల వెనుక బాధితుల ఎంతోకష్టం దాగి ఉంటుందని అలా ఉచితంగా దొరికినది ఏది ఉంచుకోవద్దని రాజు తన నిజాయితీని ప్రదర్శించాడు.. చెత్త శుభ్రం చేసేవాడైనా ఎంతో చిత్తశుద్ధి ఉన్న వ్యక్తని అంతా అభినందించారు.. పోలీసులు, మున్సిపల్ కమిషనర్ తో సహా నగర ప్రజలు ప్రశంసించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
America: ఘోర ప్రమాదం.. టేకాఫ్ అవుతూనే కుప్పకూలింది
మేనమామ చదివింపులే ఏకంగా రూ.1.56 కోట్లు!
Andhra Pradesh: అత్తకు తలకొరివి పెట్టిన ఆదర్శ కోడలు
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్

