AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Mega E-Auction: అతి తక్కువ ధరకే ఇళ్లు, స్థలాలు, వాహనాలు, యంత్రాలు.. నేడు ఎస్‌బీఐ మెగా ఈ-వేలం

SBI Mega E-Auction: తమ వద్ద తాకట్టులో ఉన్న పలు ఆస్తులను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) శుక్రవారం మెగా ఈ- వేలం వేయనుంది. నాణ్యమైన ఆస్తులను మార్కెట్‌ కంటే తక్కువ ధరకు..

SBI Mega E-Auction: అతి తక్కువ ధరకే ఇళ్లు, స్థలాలు, వాహనాలు, యంత్రాలు.. నేడు ఎస్‌బీఐ మెగా ఈ-వేలం
Subhash Goud
|

Updated on: Mar 05, 2021 | 12:58 AM

Share

SBI Mega E-Auction: తమ వద్ద తాకట్టులో ఉన్న పలు ఆస్తులను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) శుక్రవారం మెగా ఈ- వేలం వేయనుంది. నాణ్యమైన ఆస్తులను మార్కెట్‌ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇదో మంచి అవకాశమని ఎస్బీఐ పేర్కొంది. ఈ వేలంలో అన్ని రకాల ఆస్తులను విక్రయించనున్నట్లు పేర్కొంది. వీటిలో గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య ఆస్తులు, కర్మాగారాలు, యంత్రాలు, వాహనాలు వంటివి అన్ని రకాల ఆస్తులను విక్రయిస్తున్నట్లు ఎస్బీఐ ట్వీట్‌ చేసింది.

ఎవరైనా ఈ బిడ్‌లో పాల్గొనవచ్చని వెల్లడించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటనలను పలు ప్రసార సాధనాలు, సోషల్‌ మీడియాల్లో ప్రసారం చేసింది. వేలంలో ఉంచిన ఆస్తుల వివరాలను సమగ్రంగా అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఇక తాకట్టులో ఉన్న ఆస్తులకు సంబంధించి ఆయా శాఖల్లో సంబంధిత అధికారుల వివరాలను కూడా ఇచ్చింది.

ఈ బిడ్‌లో పాల్గొనేవారు సదరు ఆస్తికి సంబంధించి ఎర్నెస్ట్‌ డిపాజిట్‌ ఆఫ్‌ మనీని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే సదరు బిడర్‌ సంబంధిత శాఖలో కేవైసీ పత్రాలను సమర్పించాలని ఎస్బీఐ తెలిపింది. బిడ్‌లో పాల్గొనేవారు ఈ-వేలందారుల వద్దగానీ, మరెవరైనా గుర్తింపు పొందిన ఏజన్సీ నుంచి కానీ డిజిటల్‌ సిగ్నేచర్‌ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈఎండీ, కేవైసీ పత్రాలు సమర్పించాక బిడ్‌లో పాల్గొనేవారికి లాగిన్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌ను ఎస్బీఐ పంపిస్తుంది. తమ వద్ద తాకట్టులో ఉన్న ఆస్తుల వేలంలో ఎవరైనా పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని ఎస్బీఐ తెలిపింది.

అయితే మార్కెట్‌ విలువ కన్న తక్కువ మొత్తంలో ఇళ్లు, స్థలం, వాహనాలను సొంతం చేసుకోవాలనుకునే వారికి మంచి అవకాశమని తెలిపింది. బ్యాంకు వేలం వేయనున్న వాటిలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీస్ తో పాటు ల్యాండ్, మిషనరీ, వెయికిల్స్ మొదలైనవి ఉన్నాయి. అయితే ఈ వేలం విషయంలో తాము అత్యంత పారదర్శకంగా ఉంటామని బ్యాంకు తెలిపింది. వేలం వేసే ప్రాపర్టీస్ కు సంబంధించిన కోర్టు ఉత్తర్వులతో కావాల్సిన పత్రాలు, వివరాలు అందిస్తామని తెలిపింది.

ఈ-వేలంలో పాల్గొనడానికి ఏం కావాలంటే..

-KYC పత్రాలను సంబంధిత ఎస్‌బీఐ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. -ఈ-వేలం నోటీసులో సూచించిన మాదిరిగా నిర్దిష్ట ఆస్తి కోసం EMD. -డిజిటల్ సంతకం: డిజిటల్ సంతకాన్ని పొందటానికి బిడ్డర్లు ఈ-వేలం వేసేవారిని లేదా మరే ఇతర అధికారిక ఏజెన్సీని సంప్రదించవచ్చు -వేలంలో పాల్గొనే వారు EMD డిపాజిట్, KYC పత్రాలను సంబంధిత శాఖలో సమర్పించిన తర్వాత వారి ఈ మెయిల్ ఐడీకి రిజిస్టర్డ్ లాగిన్ ID, పాస్వర్డ్ ను పంపిస్తారు.

ఇవీ చదవండి :

mAadhaar App: మీ మొబైల్‌లో ఎంఆధార్‌ యాప్‌ ఉందా..? ఈ యాప్‌ ద్వారా 35 రకాల ఆధార్ సేవలు

PF Account Balance: ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్) బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డం ఎలా..? నాలుగు సులభమైన మార్గాలు