AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF Account Balance: ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్) బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డం ఎలా..? నాలుగు సులభమైన మార్గాలు

PF Account Balance: ఎంతో మంది ఉద్యోగులకు పీఎఫ్‌ డబ్బులే భరోసా. ఉద్యోగ విరమణ తర్వాత ఆ డబ్బులే వారికి ఆసరాగా ఉంటాయి. అందుకే ఉద్యోగులు తమ భవిష్య నిధి (పీఎఫ్‌) ..

PF Account Balance: ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్) బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డం ఎలా..? నాలుగు సులభమైన మార్గాలు
Subhash Goud
|

Updated on: Mar 04, 2021 | 11:50 PM

Share

PF Account Balance: ఎంతో మంది ఉద్యోగులకు పీఎఫ్‌ డబ్బులే భరోసా. ఉద్యోగ విరమణ తర్వాత ఆ డబ్బులే వారికి ఆసరాగా ఉంటాయి. అందుకే ఉద్యోగులు తమ భవిష్య నిధి (పీఎఫ్‌) డబ్బులను చివరి వరకు తమ ఖాతా నుంచి తీసేందుకు పెద్దగా ఇష్టపడరు. పైగా పీఎఫ్‌ ఖాతాలో డబ్బులకు వడ్డీ కూడా ఎక్కువగా వస్తుండటంతో ఆ సొమ్మను తీయకుండా అలాగే ఉంచేస్తారు. కానీ ప్రతి ఏడాది తమ ఖాతాలో వార్షిక వడ్డీ ఎంత జమ అవుతుంది..? దానిని ఎలా చెక్‌ చేసుకోవాలో అనే విషయం కొందరికి తెలిసినా.. చాలా మందికి తెలియకపోవచ్చు. తమ పీఎఫ్‌ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు మార్గదర్శకాలను అందుబాటు ఉంచింది. అవేంటంటే..

వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావడం ద్వారా..

పీఎఫ్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవాలంటే.. ముందుగా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌ www.epfindia.gov.in ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఈ-పాస్‌బుక్ పై క్లిక్ చేయాలి. ఈ పాస్‌బుక్‌పైన క్లిక్‌ చేయగానే కొత్త ట్యాబ్‌ ఓపెన్‌ అవుతుంది. ఆ కొత్త పేజీలో UAN నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావాలి. లాగిన్‌ కాగానే మన ఖాతాలో ఉన్న ప్రావిడెంట్‌ ఫండ్‌ మొత్తం, వడ్డీ మొత్తానికి సంబంధంఇచిన వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ఈ వివరాలను పీడీఎఫ్‌ (PDF) ఫార్మాట్‌లో కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఉమంగ్ యాప్ ద్వారా..

పీఎఫ్‌ ఖాతా వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉమాంగ్‌ అనే యాప్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌స్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత UAN వివరాలతో లాగిన్‌ అయి ఈపీఎఫ్‌వో ఖాతాలో ఉన్న సొమ్ము గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

మిస్డ్‌కాల్‌ ద్వారా..

ఈపీఎఫ్‌వో ఖాతాదారులు తమ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి మిస్డ్‌ కాల్‌ ఇచ్చి పీఎఫ్‌ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. ఖాతాదారులు తమ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. పీఎఫ్ నెంబ‌ర్ స‌హా.. ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంది. వ‌డ్డీ మొత్తం ఎంత అన్న వివ‌రాల‌తో కూడా మెసేజ్ వెంట‌నే మీ ఫోన్‌కు వ‌స్తుంది.

ఎస్ఎంఎస్ ద్వారా..

ఇక పీఎఫ్‌ బ్యాలెన్స్‌ SMS ద్వారా తెలుసుకోవాలంటే పీఎఫ్‌ అకౌంట్‌కు, బ్యాంక్‌ ఖాతాకు ఒకే మొబైల్‌ నెంబర్‌ అనుసంధానమై ఉండాలి. అదే నెంబర్‌ ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో కూడా అప్‌డేట్‌ అయి ఉంటే మీ మొబైల్‌ నెంబర్‌కు తరుచుగా పీఎఫ్‌ వివరాలకు సంబంధించి మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ఒక వేళ మెసేజ్‌లు రాకపోతే మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి EPFOHO UAN అని టైప్ చేసి 77382 99899 నెంబర్‌కు మెసేజ్ చేయాలి. వెంట‌నే పీఎఫ్ బ్యాలెన్స్‌, వ‌డ్డీ వివ‌రాల‌తో రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌కు మెసేజ్‌ వస్తుంది.