- Telugu News Photo Gallery Business photos Aadhaar update use maadhaar app to avail over 35 services 2
mAadhaar App: మీ మొబైల్‌లో ఎంఆధార్ యాప్ ఉందా..? ఈ యాప్ ద్వారా 35 రకాల ఆధార్ సేవలు
మీ వద్ద ఆధార్ కార్డు ఉందా..? ప్రతి అవసరానికి ఆధార్ సెంటర్‌కు, ఆధార్ సేవా కేంద్రానికో వెళ్లాల్సిన అవసరం ఉండదు.....
Subhash Goud | Edited By: Ravi Kiran
Updated on: Mar 05, 2021 | 11:54 AM

మీ వద్ద ఆధార్ కార్డు ఉందా..? ప్రతి అవసరానికి ఆధార్ సెంటర్‌కు, ఆధార్ సేవా కేంద్రానికో వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎన్నో రకాల సేవలు ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారానే లభిస్తున్నాయి.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా -UIDAI తయారు చేసిన ఎంఆధార్ యాప్‌లో దాదాపు 35 రకాల సేవలు పొందవచ్చు.ఇటీవల ఎంఆధార్ యాప్‌ను యూఐడీఏఐ అప్‌డేట్ చేసింది. అయితే ఈ యాప్ అప్‌డేట్ చేస్తే ఇంటర్‌ఫేస్ సౌకర్యవంతంగా ఉంటుంది. mAadhaar App ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో లభిస్తుంది. ఈ యాప్‌ను 13 భాషల్లో అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో ఎంఆధార్ యాప్ ఉంది.

ఒక యాప్‌లో ఐదుగురు ప్రొఫైల్ యాడ్ చేసుకునే సదుపాయం ఉంది. అంటే ఇంట్లో ఒకరు ఎంధార్ యాప్ డౌన్‌లోడ్ చేస్తే ఐదుగురి ఆధార్ నెంబర్లకు ఉపయోగించుకునేలా ఉంది. ఎంఆధార్ యాప్‌లో లభించే ముఖ్యమైన సేవల వివరాలు చూస్తే ఆధార్ క ఆర్డు డౌన్‌లోడ్ చేయవచ్చు. ఆధార్ రీప్రింట్ కోసం ఆర్డర్ చేసుకోవచ్చు.

ఒక వేళ ఆధార్ నెంబర్ మర్చిపోతే తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుంది. ఆధార్ కార్డును ఆఫ్‌లైన్ మోడ్‌లో చూడొచ్చు. రైల్వే స్టేషన్‌లలో, ఇతర ప్రాంతాల్లో ఐడీ ప్రూఫ్‌గా చూపించడానికి ఉపయోపడుతుంది. ఆధార్ కార్డులో చిరునామాను సైతం అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. పేపర్‌లెస్ షేర్ చేసుకోవచ్చు.

పేపర్‌లెస్ ఇకేవైసీ షేర్ చేయవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా ఆధార్ కార్డు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ లేదా బయోమెట్రిక్స్ లాక్ చేయవచ్చు. అలాగే ఆఫ్‌లైన్‌లో ఆధార్ ఎస్‌ఎంఎస్ సర్వీస్‌లు పొందవచ్చు. డ్యాష్ బోర్డులో ఆధార్ అప్‌డేట్ స్టేటస్, ఆధార్ రీప్రింట్ స్టేటస్ తెలుసుకునే సదుపాయం ఉంది.

ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లేందుకు అపాయింట్‌మెంట్ బుక్ చేయొచ్చు. అలాగే ఈ యాప్‌లో పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ లాంటివి అప్‌డేట్ చేసుకోవడం మాత్రం సాధ్యం కాదు.





























