SASIKALA POLITICS: క్రియాశీల రాజకీయాల్లోకి చిన్నమ్మ.. తమిళనాడు లాక్‌డౌన్ ముగియగానే ప్రకటించనున్న శశికళ

కొందరైతే రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించినా ఆ తర్వాత అవసరాలు, అవకాశాల కారణంగా తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతూ వుంటారు. సరిగ్గా ఈ కోవలోకి వస్తారు దివంగత జయలలిత నెచ్చెలి శశికళ అలియాస్ చిన్నమ్మ.

SASIKALA POLITICS: క్రియాశీల రాజకీయాల్లోకి చిన్నమ్మ.. తమిళనాడు లాక్‌డౌన్ ముగియగానే ప్రకటించనున్న శశికళ
Tamilnadu Map, Anna Dmk Party Office And Sasikala
Follow us
Rajesh Sharma

|

Updated on: May 30, 2021 | 4:41 PM

SASIKALA POLITICS STATEMENT AFTER LOCK-DOWN: ఒకసారి రాజకీయం చేయడం అలవాటయ్యాక దాని నుంచి దూరంగా వుండడం సాధ్యం కాదేమో. రాజకీయ సన్యాసం చేసిన వారిని వెతుక్కుంటూ పదవులు వచ్చిన పరిస్థితులను దేశం చాలానే చూసింది. రాజకీయాలకు దూరంగా వుంటున్న తరుణంలో పీవీ నరసింహారావు (PV NARASIMHA RAO)ను ఏకంగా ప్రధాన మంత్రి (PRIME MINISTER) పదవి వెతుక్కుంటూ వచ్చింది. అలాగే వయసు దృష్ట్యా ఇక రాజకీయం చేయలేనని, ఎన్నికల్లో పోటీ చేయలేనని ప్రకటించిన కొణిజేటి రోశయ్య (KONIJETI ROSAIAH)ను తొలుత ఎమ్మెల్సీ (MLC) పదవి.. ఆ తర్వాత సీఎం (CM) సీటు.. ఆ వెనకే గవర్నర్ (GOVERNOR) గిరీ వెతుక్కుంటూ వచ్చాయి. ఇక కొందరైతే రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించినా ఆ తర్వాత అవసరాలు, అవకాశాల కారణంగా తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతూ వుంటారు. సరిగ్గా ఈ కోవలోకి వస్తారు దివంగత జయలలిత (JAYALALITA) నెచ్చెలి శశికళ (SASIKALA) అలియాస్ చిన్నమ్మ.

నాలుగేళ్ళ జైలు శిక్ష.. అన్నా డిఎంకే (ANNA DMK) నుంచి బహిష్కరణ.. సరిగ్గా ఎన్నికలకు ముందు విడుదల.. వెరసి అప్పట్లో చేసేదేమీ లేక.. చేయగలిగింది ఏమీ కనపడకా.. శశికళ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అన్న మాటకు అనుగుణంగానే తమిళనాడు అసెంబ్లీ (TAMILNADU ASSEMBLY) ఎన్నికల్లో ఆమె ఎక్కడా కనిపించలేదు. ఎన్నికలు ముగిశాయి.. పదేళ్ళ పాటు అధికారం వెలగబెట్టిన అన్నా డిఎంకే.. ఓటమి పాలైంది. విపక్ష పాత్రలోకి చేరింది. ఈనేపథ్యంలోనే తమిళనాడులో కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) విరుచుకుపడింది. దేశంలో ప్రస్తుతం రోజువారీ అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు (CORONA POSITIVE CASES) నమోదవుతున్నది తమిళనాడు (TAMILNADU)లోనే. ఈక్రమంలోనే శశికళ తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. ఇదే అంశాన్ని చిన్నమ్మ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించనట్లు తెలుస్తోంది. జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే పార్టీ తీవ్ర ఒడిదుడుకులకు గురైన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు జైలు నుంచి విడుదలైన శశికళ అన్నా డిఎంకేలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. పళని-పన్నీరు ద్వయం ఆమెకు అడ్డుకట్ట వేశారు. దాంతో రాజకీయాలకు దూరంగా వుంటున్నట్లు అప్పట్లో ఆమె ప్రకటించారు.

తాజాగా శశికళదిగా చెబుతున్న ఓ ఆడియో టేపు (AUDIO TAPE) తమిళనాట సంచలనం రేపుతోంది. సామాజిక మాధ్యమాల్లో (SOCIAL MEDIA) వైరలవుతోంది. ‘‘ ఎవరికి ఎలాంటి ఆందోళన అవసరం లేదు.. పార్టీ విషయాలను తప్పకుండా చక్కబెడతాను.. ధైర్యంగా వుండండి.. కరోనా సెకెండ్ వేవ్ ముగిసిన తర్వాత నేను మళ్ళీ వస్తాను.. ’’ అన్నది ఆ ఆడియో టేపు సారాంశం. ఆమె మాటలకు స్పందించిన కొందరు అమ్మా మీ వెనకే మేం వుంటాం.. అంటూ రిప్లై ఇవ్వడం కూడా ఆ ఆడియో టేపులో రికార్డయ్యింది. ఈ క్రమంలో కరోనా పాండమిక్ పరిస్థితి ముగియగానే శశికళ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని ప్రచారం జోరందుకుంది.

ఈ ఆడియో టేప్‌కు సంబంధించి మరో కథనం కూడా వెలువడింది. మే 29న శశికళ స్వయంగా అన్నా డిఎంకే పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్సు (TELE CONFERENCE) నిర్వహించినట్లు చెప్పుకుంటున్నారు. ఈ కాన్ఫరెన్సుకు సంబంధించిన ఆడియోలు లీక్ అయ్యాయని అంటున్నారు. ‘‘ రాజకీయాలు వద్దనుకున్నాను కానీ ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీ ఉన్న పరిస్థితిని చూసి బాధేస్తోంది.. అందుకే పార్టీని కాపాడటానికి రాజకీయాల్లోకి వస్తాను.. ఎన్నోఏళ్ల పాటు ఎంతో కష్టపడి పార్టీని ఆ స్థాయికి తీసుకొస్తే దాన్ని ప్రస్తుత నాయకులు నాశనం చేశారు.. ’’ అని ఈ టేపుల్లో చిన్నమ్మ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే ఈ టెలికాన్ఫరెన్సులో పాల్గొన్న అన్నా డిఎంకే నేతలు.. ఫళని స్వామి (PHALANI SWAMY) విధానాల వల్లే పార్టీ ఘోరంగా నష్టపోయిందని వ్యాఖ్యానించారు. చిన్నమ్మ రాకతోనే పార్టీకి పునర్వైభవం సాధ్యమని ఆమెకు వారంతా చెప్పి మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలను గమనిస్తే.. పొలిటికల్ రీఎంట్రీకి శశికళ శరవేగంగా పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్నా డిఎంకే (ANNA DMK)పై తమ పట్టు కోసం ఓ వైపు న్యాయపోరాటం కొనసాగిస్తున్న శశికళ (SASIKALA).. తాజాగా పార్టీలోని తన సహచరుల సాయంతో ప్రస్తుత నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే చర్యలను చాపకింద నీరులా ప్రారంభించారు. శశికళకు మద్దతుగా అన్నాడీఎంకే తరఫున చెన్నై (CHENNAI) సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల భారీ ఎత్తున పోస్టర్లు వెలిశాయి. ఈ విషయం పార్టీ వర్గాల్లో సంచలనం కలిగించింది. చెన్నైలో అన్నా డిఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట, పుదుక్కోట్టై (PUDUKOTTAI) ప్రాంతంలో శశికళ రీఎంట్రీని కోరుతూ పోస్టర్లు అతికించారు. చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఎదురుగా శశికళకు మద్దతు తెలుపుతూ పోస్టర్లు వెలిశాయి. వీటి వెనుక పన్నీరు సెల్వం అనుచరుల హస్తమున్నట్లు ప్రచారం జరిగింది. ఫళనిస్వామిని పరోక్షంగా హెచ్చరికలు పంపేదుకే శశికళను స్వాగతిస్తూ పోస్టర్లు అతికించినట్లు భావించారు. పోస్టర్ల ప్రభావమో లేక మరే కారణమైదేనా వుందేమో కానీ మే 10న మధ్యాహ్నానికి ఓపీఎస్-ఈపీఎస్ మధ్య సయోధ్య కుదిరింది. మాజీ ముఖ్యమంత్రి ఫళనిస్వామియే అసెంబ్లీలో విపక్ష నేతగా ఎన్నికయ్యారు. పన్నీరు సెల్వం ఈ విషయంలో వెనక్కి తగ్గారు.

అలాగే పుదుక్కోట్టై ప్రాంతంలోను అన్నాడీఎంకే కార్యకర్తల తరఫున పోస్టర్లు అతికించారు. ఎంజీఆర్‌ (MGR) రూపొందించిన, జయలలిత (JAYALALITA) కాపాడిన పార్టీని శశికళ ఆధ్వర్యంలో నడిపిద్దామని అందులో రాశారు. అన్నాడీఎంకే పార్టీని గట్టెక్కించాలంటే చిన్నమ్మ అలియాస్ శశికళ వంటి బలమైన, వ్యూహకర్త  (STRATEGIST) సారథ్యం అవసరమని పార్టీ వర్గాలిప్పటికే బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు. స్టాలిన్ లాంటి దిగ్గజ, సీనియర్ నేత వ్యూహాల నుంచి అన్నా డిఎంకేను కాపాడుకోవాలంటే చిన్నమ్మ సారథ్యం అవసరమని అంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (TAMILNADU ASSEMBLY ELECTION RESULTS) వెలువడిన వెంటనే ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు, భవిష్యత్ వ్యూహాలకు తెరలేచినట్లు తమిళ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారంలో వున్న అన్నా డిఎంకే (ANNA DMK) పరాజయాన్ని ముందే ఊహించి.. కొందరు ఢిల్లీ పెద్దల సలహా మేరకు రాజకీయ సన్యాసం తీసుకున్న చిన్నమ్మ అలియాస్ శశికళ (SASIKALA) తిరిగి పాచికలు కదపడం అప్పుడే ప్రారంభించినట్లు తమిళ రాజకీయ వర్గాల్లో (TAMIL POLITICAL CIRCLE) పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. జయలలిత (JAYALALITA) మరణానంతరం పార్టీపై పట్టు సాధించినా.. కాలం కలిసి రాక జైలు పాలైన శశికళ… రాంగ్ టైమ్‌లో జైలు నుంచి విడుదలయ్యారు. అన్నా డిఎంకేపై పట్టు సాధించే సమయం లేకుండానే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (TAMILNADU ASSEMBLY ELECTIONS) నగారా మోగింది. దానికి తోడు చిన్నమ్మ పెద్దరికాన్ని ఏ మాత్రం ఇష్టపడని ఫళనిస్వామి (PALANISWAMY), పన్నీరుసెల్వం (PANNIR SELVAM).. అధికారంలో వుండడంతో చిన్నమ్మ వ్యూహాలు అమలు పరచడం అంత ఈజీ కాలేదు. దానికి తోడు తనని పదే పదే నిలువరిస్తున్న ఢిల్లీ పెద్దలు కూడా ప్రతికూలంగానే వున్నారు. దాంత చేసేదేమీ లేక ఫ్యూచర్‌లో చూసుకుందామనుకుందో ఏమో ఫిబ్రవరిలో రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు శశికళ.

తెరచాటు పరిణామాలు కూడా వేగవంతమైనట్లు తాజాగా తమిళ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ (TAMILNADU ASSEMBLY) ఎన్నికలకు ముందు అనూహ్యంగా రాజకీయ సన్యాసాన్ని ప్రకటించిన శశికళ (చిన్నమ్మ)  తెరచాటు రాజకీయాలను మాత్రం కొనసాగిస్తూనే వుంది. పేరుకే రాజకీయాలకు రామ్ రామ్.. కానీ రాజకీయాలపై మాత్రం అదే ఆసక్తి. కేవలం ఆసక్తే కాదు.. తెరచాటుగా రాజకీయ పావులు కూడా కదుపుతున్నారు శశికళ (SASIKALA). అస్త్ర సన్యాసం చేసిన తర్వాత పూర్తిగా ఆధ్యాత్మికంగా వుండిపోతున్నట్లు పైకి కనిపించినా.. తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. పరోక్షంగా అన్నా డిఎంకే (ANNA DMK) పార్టీపై పట్టుకు యత్నిస్తూనే వున్నారు. అన్నాడీఎంకేపై న్యాయస్థానంలో ఆమె సాగిస్తున్న ఆధిపత్య పోరు కొనసాగిస్తూనే వున్నారు. జయలలిత (JAYALALITA) జీవించి ఉన్నంత వరకు నీడలా ఆమె వెన్నంటి ఉండిన శశికళ ఆ తరువాత ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. అంతా జయను పోలినట్లుగా చీరకట్టు, నుదుటన బొట్టు, పాద నమస్కారాలు, ఆశీర్వచనాలతో ప్రారంభమైన చిన్నమ్మ వైభవం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునే వరకు సాగింది. ఆ తర్వాతే పరిస్థితులు మారిపోయాయి. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ళ జైలు శిక్ష పడింది. నిజానికి ఈ కేసులో ఏ1 గా వున్న జయలలిత అప్పటికే మరణించడంతో ఏ2గా వున్న శశికళ ప్రధాన ముద్దాయి అయ్యారు. నాలుగేళ్ళ జైలు శిక్షకు వెసులుబాటు కల్పించుకునే అవకాశాలు ఏ మాత్రం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె జైలుకు వెళ్ళారు.

మరోవైపు అన్నా డిఎంకే నుంచి సస్పెండై వేరు కుంపటి పెట్టుకున్నాడు శశికళ అన్న కొడుకు టిటికే దినకరన్ (TTK DINAKARAN). ఆ పార్టీతో వుంటున్నట్లే వుంటే అన్నా డిఎంకేపై కన్నేశారు శశికళ. జైలు నుంచి విడుదలై అట్టహాసంగా చెన్నై చేరుకున్న శశికళ.. తనకు చక్రం తిప్పే సమయం లేకపోవడంతో  వ్యూహాత్మకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన చిన్నమ్మ.. తాజాగా ఫళనిస్వామి, పన్నీరు సెల్వంలకు వ్యతిరేకంగా వున్న అన్నా డిఎంకే నేతలకు సంకేతాలు పంపడం అప్పుడే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వం బలంగా వుంటే భవిష్యత్తులో తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశం వుంటుందని, బలహీన నాయకత్వం వుంటే.. స్టాలిన్ దూకుడు ముందు అన్నా డిఎంకే తుత్తునియలు కాకతప్పదని పలువురు అన్నా డిఎంకే నేతలు భావిస్తున్న నేపథ్యంలో చిన్నమ్మ లాంటి స్ట్రాంగ్ లీడరే తమకు కావాలని పలువురు కోరుకుంటున్నారు. తాజా ఎన్నికల్లో ఓటమికి సీఎం ఫళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలే కారణమని అప్పుడే పలువురు అన్నా డిఎంకే నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఓటమిని కారణంగా చూపి.. చిన్నమ్మ వుంటేనే భవిష్యత్తు అనే రకంగా పార్టీలో తన అనుకూల వాదులతో మాట్లాడించడం ద్వారా తిరిగి పార్టీలోకి రావడమే కాదు.. అనతికాలంలోనే పార్టీపై గ్రిప్ సాధించేందుకు చిన్నమ్మ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!