Samajwadi Party: యూపీలో పెరిగిన సైకిల్ స్పీడ్.. నాటీ స్థానాల్లో మళ్లీ పాగా వేసిన సమాజ్ వాదీ పార్టీ..

UP Election 2022: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఒక్క పంజాబ్ మినహా.. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో విజయం సాధించింది.

Samajwadi Party: యూపీలో పెరిగిన సైకిల్ స్పీడ్.. నాటీ స్థానాల్లో మళ్లీ పాగా వేసిన సమాజ్ వాదీ పార్టీ..
Sp
Follow us

|

Updated on: Mar 13, 2022 | 9:18 PM

UP Election 2022: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఒక్క పంజాబ్ మినహా.. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలేకపోయింది. దీంతోపాటు అధికారంలో ఉన్న పంజాబ్‌లో కూడా ఘోర ఓటమిని చవిచూసింది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోని.. సత్తాచాటింది. అయితే. యూపీలో మాత్రం.. 2017లో వచ్చిన స్థానాలను బీజేపీ నిలబెట్టుకోలేకపోయింది. అప్పుడు 312 సీట్లను బీజేపీ గెలవగా.. (uttar pradesh election result 2022) తాజాగా జరిగిన ఎన్నికల్లో 255 సీట్లను మాత్రమే సాధించింది. అయితే.. యోగి సర్కార్ వరుసగా రెండు సార్లు పాలన చేపట్టిన ప్రభుత్వం రికార్డుల్లోకెక్కింది. అయితే.. ఎలాగైనా యూపీలో పాగా వేయాలనుకున్న సమాజ్ వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో సత్తా చాటనప్పటికీ.. గతంలో కంటే.. ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (SP) 2012లో గెలుచుకున్న సీట్లను తిరిగి 79 స్థానాలను గెలుచుకొని యూపీలో అతిపెద్ద పార్టీగా స్థానాన్ని నిలుపుకుంది. ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్ వాదీ అంతకుముందు 51 సీట్లను కోల్పోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ధాటికి 47 సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 111 సీట్లను గెలుచుకొని ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకున్నట్లు వ్యాసకర్త ఆకాష్ గులాంకర్ పేర్కొన్నారు.

ఎస్పీకి అనుకూలంగా.. 

2012లో యూపీలో ఎస్పీ అధికారంలోకి వచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 సీట్లతో ఎస్పీ అఖండ విజయం సాధించింది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. 2017లో ఈ సీట్లల్లో కేవలం 36 సీట్లను మాత్రమే నిలబెట్టుకోగలిగింది. మిగిలిన 206 స్థానాలను భారతీయ జనతా పార్టీ (బిజెపి), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి), కాంగ్రెస్ గెలుచుకున్నాయి. 2017 ఎన్నికల్లో ఎస్పీతో కలిసి బీఎస్పీ, కాంగ్రెస్ పోటీ చేశాయి. మరోవైపు ఎస్పీ నుంచి 176 సీట్లు, మిగిలిన 136 సీట్లల్లో పలు పార్టీల అభ్యర్థులపై బీజేపీ విజయం సాధించింది.

గత మూడు పర్యాయాలు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఇలా..

అయితే.. 2022 ఎన్నికల ఫలితాలు ఎస్పీ 2012లో గెలుచుకున్న స్థానాలను నిలబెట్టుకోవడం వల్ల వందకు పైగా స్థానాలను గెలుచుకోగలిగినట్లు చూపుతున్నాయి. ఇలా మొత్తం 79 స్థానాలను పార్టీ నిలుపుకుంది. వీటిలో 49 స్థానాలను బీజేపీ నుంచి గెలుచుకుంది. ఈ సీట్లన్నీ 2017లో సమాజ్ వాదీ స్థానంలో కాషాయ పార్టీ గెలుచుకుంది. ఇంకా పాత కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, బీఎస్‌పీల నుంచి 11 స్థానాలను నిలుపుకుంది. 2017 ఎన్నికల్లో గెలుచుకున్న స్థానాల్లో ఆ పార్టీ 29 సీట్లను నిలబెట్టుకుంది. మిగిలిన 32 సీట్లు 2012లో ఎస్పీ గెలుచుకోలేదు. అయితే.. ఆసక్తికర విషయం ఏంటంటే..? UPలో సమాజ్ వాదీ గెలుచుకున్న 28 సీట్లు.. గత పర్యాయల నుంచి అక్కడ గెలవలేదు.

మరింత బలపడిన ఎస్పీ..

బీజేపీతో జరిగిన ప్రత్యక్ష పోటీలో ప్రాంతీయ పార్టీ ఎస్పీ గత ఎన్నికలతో పోలిస్తే మెరుగైన పనితీరు కనబరిచింది. 2022లో 32 శాతంతో పోలిస్తే 2017లో SP ప్రత్యక్ష పోటీలో 18 శాతం సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఎస్పీతో జరిగిన ప్రత్యక్ష పోటీలో బీజేపీ సీటు వాటా 2017తో పోలిస్తే 82 నుంచి 68 శాతానికి తగ్గింది.

UP అసెంబ్లీ ఎన్నికల్లో SP – BJP మధ్య ప్రత్యక్ష పోటీ ఇలా..

2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు 191 స్థానాల్లో ప్రత్యక్ష పోరులో ఉన్నాయి. అయితే తాజగా జరిగిన ఎన్నికల్లో 403 స్థానాలకు గాను 305 స్థానాల్లో హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ 206 సీట్లు గెలుచుకోగా, ఎస్పీ 99 సీట్లను గెలుచుకుంది. బీజేపీతో జరిగిన ప్రత్యక్ష పోరులో అఖిలేష్ పార్టీ దాదాపు మూడు రెట్ల సీట్లను సంపాదించుకోగలిగింది.

ఎస్పీ గెలిచిన మిగిలిన 11 స్థానాల్లో 9 స్థానాల్లో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి ప్రత్యక్ష పోటీలో ఉంది. ఆ స్థానాల్లో అప్నా దళ్ (సోనీలాల్) పై 4, నిషాద్ పార్టీపై 4 సీట్లు గెలుచుకుంది. మిగిలిన రెండు స్థానాల్లో అప్నా దళ్ (కామర్వాడీ)పై ఎస్పీ విజయం సాధించింది.

Also Read:

CWC Meeting: మూడు గంటల పాటు వాడివేడిగా సీడబ్ల్యూసీ సమావేశం.. ప్రధానంగా వీటిపైనే చర్చ.. నాయకత్వ మార్పుపై..

AP BJP: యూపీ గెలిచాం.. ఆంధ్రప్రదేశ్ గెలుస్తాం.. బీజేపీ ఇన్‌ఛార్జ్ సునీల్ ధియోధర్ కీలక వ్యాఖ్యలు