CWC Meeting: మూడు గంటల పాటు వాడివేడిగా సీడబ్ల్యూసీ సమావేశం.. ప్రధానంగా వీటిపైనే చర్చ.. నాయకత్వ మార్పుపై..

Congress Working Committee Meeting: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(CWC Meeting) సమావేశంలో వాడి వేడి చర్చ జరిగింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన భేటీకి కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా..

CWC Meeting: మూడు గంటల పాటు వాడివేడిగా సీడబ్ల్యూసీ సమావేశం.. ప్రధానంగా వీటిపైనే చర్చ.. నాయకత్వ మార్పుపై..
Cwc Meeting
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 13, 2022 | 8:38 PM

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(CWC Meeting) సమావేశంలో వాడి వేడి చర్చ జరిగింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన భేటీకి కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పీ చిదంబరం తదితరులు భేటీలో పాల్గొన్నారు. అధిష్టానానికి సవాళ్లు విసురుతున్న జీ-23 అసంతృప్తి నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రాహుల్‌గాంధీతో పాటు పలువురు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మరో ముగ్గురు సీనియర్ నేతలు భేటీకి రాలేకపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కరోనా సోకడం వల్ల ఏకే ఆంటోనీ గైర్హాజరైనట్లు చెప్పారు. అయితే.. ముకుల్‌ వాస్నిక్‌ను కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ను చేయాలని జీ23 నేతలు తెరపైకి తెచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్‌ శ్రేణులను ఉత్తేజ పర్చేందుకు ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని చాలామంది సీనియర్‌ నేతలు కోరారు.

ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు సంస్థాగత ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై చర్చించారు. కాగా, కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయాలని జీ-23 అసమ్మతి నేతలు సోనియా గాంధీకి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, ఇన్చార్జిలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్లు, జీ-23 అసమ్మతి గ్రూపు నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఈ భేటీకి హాజరయ్యారు. 57మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

సెప్టెంబర్‌లో జరగాల్సిన ఎన్నికలను తాజా పరిస్థితుల దృష్ట్యా మూడు నెలల ముందే జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని గాంధీ కుటుంబమే చేపట్టాలని ఏఐసీసీ కార్యాలయంలో ముందు అభిమానులు ఆందోళన చేశారు.

అయితే రాహుల్‌గాంధీని వెంటనే కాంగ్రెస్‌ అధ్యక్షుడిని చేయాలని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కోరారు. పార్టీ ఐకమత్యంగా ఉండాలంటే గాంధీ కుటుంబమే నాయకత్వం వహించాలన్నారు.

ఇవి కూడా చదవండి: Honey Bitter: ఇక్కడ తేనె చెదుగా ఉంటుంది.. అయినా అమృతమే.. ఈ ప్రదేశంలో అదే స్పెషల్.. ఎక్కడంటే..

Andhra Pradesh: జోలె పట్టి భిక్షాటన మొదలు పెట్టిన సర్పంచ్.. కదలివచ్చిన గ్రామం.. కారణం తెలిస్తే..