Pawan Kalyan: రేపు జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవం.. గుంటూరు జిల్లాలో భారీ ఏర్పాట్లు..
Jana Sena Formation Day: సోమవారం గుంటూరు కేంద్రంగా జనసేనాని సమరశంఖం పూరించబోతున్నారా? ఇది కేవలం ఆవర్భావసభ మాత్రమే కాదన్న పవన్ ప్రకటన వెనుక వ్యూహం ఏంటి? ఇంతకీ పవన్ ఏం చెప్పబోతున్నారు? పార్టీ శ్రేణులు, రాష్ట్ర పజలకు..
సోమవారం గుంటూరు కేంద్రంగా జనసేనాని సమరశంఖం పూరించబోతున్నారా? ఇది కేవలం ఆవర్భావసభ (Jana Sena Formation Day) మాత్రమే కాదన్న పవన్ ప్రకటన వెనుక వ్యూహం ఏంటి? ఇంతకీ పవన్ ఏం చెప్పబోతున్నారు? పార్టీ శ్రేణులు, రాష్ట్ర పజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు..? భీమ్లానాయక్ మూవీ లోని సాంగ్ స్టైల్లో.. అదే ట్యూన్‌తో సోమవారం జరిగే అవిర్భావ సభ కోసం సాంగ్ రిలీజ్ చేసింది జనసేన పార్టీ. సోమవారం జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవం. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామ సమీపంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ వేదికకు దామోదరం సంజీవయ్యగారి పేరు పెట్టారు. ఇదే సభలో సోమవారం కీలక ప్రసంగం చేయబోతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.
ఇది తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం జరిగే సభ అని చెప్పారు పవన్. ప్రజల ఇబ్బందులపై గళమెత్తడంతోపాటు.. సభా వేదిక నుంచే భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తానని ప్రకటించారు. భవిష్యత్తు జెండాని మోయటంకంటే బాధ్యత ఏముంటుంది.? ఒకతరం కోసం యుద్ధం చేయటంకంటే సాహసం ఏముంటుంది అంటూ పార్టీ శ్రేణులకు సందేశమిచ్చారు పవన్. మొత్తానికి రేపు జరగబోయే సభ ఇతర ఆవిర్భావ సభలకు పూర్తి భిన్నంగా ఉండనుంది. ఈ విషయాన్ని స్వయంగా పవనే చెప్పారు. ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్న వేళ… ముందస్తు ముచ్చట్లు జోరుందుకున్న సమయాన.. పవన్ ఎలాంటి అంశాలు మాట్లాడుతారు. ఏం ప్రకటించబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది.
అటు విజయవాడలో జనసేనా ఫ్లెక్సీ వివాదం కలకలం రేపింది. జనసేన ఆవిర్భావ సభకోసం ప్రకాశం బ్యారేజ్ వారథిపై కట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. సీనియర్ నేత నాదెండ్ల మనోహర్.. స్పాట్‌కి వెళ్లి సిబ్బందిని ప్రశ్నించారు. పోలీసులే ఇదంతా దగ్గరుండి చేయిస్తున్నారని వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ తీరుని నిరసిస్తూ జనసేన శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
ఇవి కూడా చదవండి: Honey Bitter: ఇక్కడ తేనె చెదుగా ఉంటుంది.. అయినా అమృతమే.. ఈ ప్రదేశంలో అదే స్పెషల్.. ఎక్కడంటే..
Andhra Pradesh: జోలె పట్టి భిక్షాటన మొదలు పెట్టిన సర్పంచ్.. కదలివచ్చిన గ్రామం.. కారణం తెలిస్తే..