AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sadhguru Health Update Video: సద్గురు హెల్త్‌ ఆప్‌డేట్‌ వీడియో వైరల్.. ఆస్పత్రి బెడ్‌పై కూల్‌గా కూర్చుని, పేపర్‌ చదువుతూ..

ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు ఇటీవల ఢిల్లీలోని అపోలో హాస్పిటల్‌లో అత్యవసర మెదడు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఆయన హెల్త్‌కు సంబంధించిన ఆప్‌టేడ్‌ తాజాగా వెలువడింది. సర్జరీ తర్వాత ఆయన వేగంగా కోలుకుంటున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో..

Sadhguru Health Update Video: సద్గురు హెల్త్‌ ఆప్‌డేట్‌ వీడియో వైరల్.. ఆస్పత్రి బెడ్‌పై కూల్‌గా కూర్చుని, పేపర్‌ చదువుతూ..
Sadhguru Health Update
Srilakshmi C
|

Updated on: Mar 26, 2024 | 12:26 PM

Share

న్యూఢిల్లీ, మార్చి 26: ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు ఇటీవల ఢిల్లీలోని అపోలో హాస్పిటల్‌లో అత్యవసర మెదడు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఆయన హెల్త్‌కు సంబంధించిన ఆప్‌టేడ్‌ తాజాగా వెలువడింది. సర్జరీ తర్వాత ఆయన వేగంగా కోలుకుంటున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో స్లో మ్యూజిక్‌తో కూడిన 19 సెకన్ల ఈ వీడియోలో ఆయన ఆస్పత్రి బెడ్‌పై కూర్చుని, తలకు బ్యాండెజ్‌తో న్యూస్‌ పేపర్‌ చదువుతూ కనిపించారు. సద్డురు వేగంగా కోలుకుంటున్నట్లు (#SpeedyRecovery) హ్యాష్‌ట్యాగ్‌లతో సద్గురు తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు సద్గురు త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

కాగా సద్గురు ప్రస్తుత వయసు 66 ఏళ్లు. ఆయన గత 4 వారాలుగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు. ఆయన రోజువారీ కార్యకలాపాల్లో పడి దానిని విస్మరించారు. ఆయనకు తల నొప్పి ఉన్నప్పటికీ మార్చి 8 న మహాశివరాత్రి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. మార్చి 15న నొప్పి తీవ్రమైంది. దీంతో ఆయన వైద్యులను సంప్రదించారు. అదే రోజు వైద్యుల వద్ద ఎమ్‌ఆర్‌ఐ చేయించుకుని సాయంత్రం 6 గంటలకు మరో ముఖ్యమైన సమావేశం ఉండటంతో వెళ్లిపోయారు. ఎమ్‌ఆర్‌ఐ రిపోర్టులో మెదడులో అంతర్గత రక్తస్రావం జరుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది మెదడు వెలుపల, ఎముకల కింద జరిగింది. రెండో చోట్ల అలా రక్తస్రావం జరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఒకటి మూడు వారాల క్రితం జరిగింది. రెండవది రెండు నుండి- మూడు రోజుల క్రితం జరిగింది.

ఇవి కూడా చదవండి

దీంతో అయన మార్చి 17న తలలో అంతర్గత రక్తస్రావంతోపాటు, మెదడులో వాపు కారణంగా ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇక అదే రోజు ఆస్పత్రి వైద్యుల బృందం అత్యవసర శస్త్రచికిత్స చేశారు. డాక్టర్ వినిత్ సూరి, డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీలతో కూడిన వైద్యుల బృందం ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ మేరకు సద్గురును పరీక్షించిన అపోలో హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరి ఆయన ఆరోగ్యం గురించిన అప్‌డేట్‌ను మార్చి 20న మీడియాతో పంచుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.