AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యూడిషియల్ రిమాండ్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కవిత అరెస్టయ్యారు. ఈ కేసులో కవిత ఈడీ కస్టడి ఇవ్వాల్టి (మార్చి 26 2024) తో ముగిసింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్, కస్టడీపై సుధీర్ఘ వాదనలు కొనసాగాయి.

Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యూడిషియల్ రిమాండ్..
MLC Kavitha
Shaik Madar Saheb
| Edited By: TV9 Telugu|

Updated on: Apr 05, 2024 | 5:57 PM

Share

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కవిత అరెస్టయ్యారు. ఈ కేసులో కవిత ఈడీ కస్టడి ఇవ్వాల్టి (మార్చి 26 2024) తో ముగిసింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటీషన్, ఈడీ కస్టడీ పిటీషన్ల పై సుధీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ సందర్బంగా ఈడీ 15 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరింది. ఈ కేసులో కొందరిని అరెస్టు చేశామని.. మరికొందరిని ప్రశ్నిస్తున్నామని తెలిపింది. ఇప్పటికే 10 రోజులు ఈడీ కస్టడీలో ఉన్న కవితను..  కీలక అంశాలపై ఆరా అధికారులు ఆరా తీశారు. లిక్కర్‌ స్కామ్‌లో రూ.వందకోట్ల ముడుపులపై  ఈడీ ఆరాతీసింది. ఈ వ్యవహారాన్ని కవితే నడిపించారంటూ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. అయితే, కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పిటీషన్ పై వివరణ ఇచ్చేందుకు ఈడీ సమయం కోరడంతో రౌస్ అవెన్యూ కోర్టు ఆర్టర్ ను రిజర్వ్ చేసింది. అనంతరం ధర్మాసనం కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు.. 14 రోజులపాటు కోర్టు కవితకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో కవితను అధికారులు తీహార్ జైలుకు తరలిస్తున్నారు. కాగా.. కవిత మధ్యంతర బెయిల్ పై విచారణను కోర్టు ఏప్రిల్ 1న చేపట్టనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.

వాదనలు ఇలా..

కవితని ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసుకున్నామని.. కొందరితో ఎదురు బొదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించామని ఈడీ కోర్టుకు తెలిపింది. వైద్య పరీక్షల నివేదికలు కవితకు అందజేయాలని కోరిన కవిత తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కవిత బెయిల్ పిటిషన్ మీద రిప్లై ఇచ్చేందుకు ఈడీ సమయం కోరింది. చిన్న కొడుకు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. వచ్చే నెల 16 వరకు చిన్న కొడుకుకు పరీక్షలు ఉన్నాయని.. అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనల అనంతరం, కవిత అభ్యర్థనపై ఆర్డర్ రిజర్వ్ చేశారు.. జడ్జి కావేరి బవేజ.. ఈ క్రమంలో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోరిన ఈడీ.. మధ్యంతర బెయిల్ మీద సైతం తమ వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరింది.

కవిత సంచలన వ్యాఖ్యలు..

కోర్టుకు హాజరవుతున్న క్రమంలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటూ పేర్కొన్నారు. తాను క్లీన్ గా బయటకు వస్తానని.. అప్రూవర్ గా మారనని పేర్కొన్నారు. ‘‘ఇది మనీలాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు.. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు.. ఒక నిందితుడు ఆల్రెడీ బిజెపిలో చేరాడు.. ఇంకో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది.. మూడో నిందితుడు రూ 50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడు.. నేను క్లీన్ గా బయటకు వస్తా.. అప్రూవర్‌గా మారేది లేదు’’.. అంటూ కవిత పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..