బిహార్ అసెంబ్లీలో రభస, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బలవంతంగా లాక్కు వెళ్లిన మార్షల్స్, పలువురికి గాయాలు

బీహార్ అసెంబ్లీ లో పెద్దఎత్తున రభస జరిగింది. రాష్ట్ర పోలీసులకు విస్తృత అధికారాలు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్ ను ముట్టడించానికి యత్నించారు.

  • Umakanth Rao
  • Publish Date - 1:14 pm, Wed, 24 March 21
బిహార్ అసెంబ్లీలో రభస, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బలవంతంగా లాక్కు వెళ్లిన మార్షల్స్, పలువురికి గాయాలు
Ruckus In Bihar Assembly

బీహార్ అసెంబ్లీ లో పెద్దఎత్తున రభస జరిగింది. రాష్ట్ర పోలీసులకు విస్తృత అధికారాలు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్ ను ముట్టడించానికి యత్నించారు. బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ బిల్లు-2021 పేరిట గల ఈ బిల్లు నిరంకుశమైనదని, దీన్ని వెంటనే ఉపసంహరించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. వీరి నిరసనతో సభ 5 సార్లు వాయిదా పడింది.  వీరిని సభ నుంచి తరలించడానికి  స్పీకర్ మార్షల్స్ ను, పోలీసులను పిలిపించారు. అయితే ఈ సభ్యులంతా తాము బయటకు వెళ్లేందుకు నిరాకరించడంతో మార్షల్స్, పోలీసులు బలవంతంగా ఈ ఎమ్మెల్యేలను బయటకు తీసుకుపోయారు. ఈ క్రమంలో మహిళా ఎమ్మెల్యేలని  కూడా  చూడకుండా వారిని ఈడ్చుకుని పోయారు.  ఈ ఎమ్మెల్యేల్లో సీనియర్ సభ్యులు కూడా ఉన్నారు.  చివరకు వీరు సభ బయట చేరి స్పీకర్ విజయ్ సిన్హా ఛాంబర్ వద్ద ప్రదర్శనకు దిగారు. ఛాంబర్ లోనికి చొచ్చుకు పోవడానికి యత్నించారు. ఆ  సందర్భంగా పోలీసులు చేసిన లాఠీ ఛార్జిలో పలువురు గాయపడ్డారు. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు.

Ruckus In Bihar Assembly 2

Ruckus In Bihar Assembly 2

అంతకుముందు డాక్ బంగ్లా లో సీనియర్ ఆర్జేడీ నేతలను పోలీసులు అరెస్టు చేసినందుకు నిరసనగా పలువురు సభ్యులు సభలో నినాదాలు చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్  చేశారు. తమ సీట్లలో కూర్చోవలసిందిగా  స్పీకర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారు ఖాతరు చేయలేదు. కాగా విపక్ష సభ్యుల తీరును సీఎం నితీష్ కుమార్ తీవ్రంగా ఖండించారు.  అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితిని తానెన్నడూ చూడలేదన్నారు. వారు  చర్చలో పాల్గొనాల్సిందని, వారు అడిగే ప్రతి ప్రశ్నకూ తాము సమాధానం చెప్పేవారమని ఆయన అన్నారు. అటు స్పీకర్ కూడా ప్రతిపక్షాల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ …రాజ్యాంగం పట్ల వారికి గౌరవం లేదన్నారు.  హుందాగా చర్చలో పాల్గొనడంపోయి దౌర్జన్యాలకు పాల్పడుతారా అని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని చదవండి ఇక్కడ :‘నాకు తెలుసు సుశాంత్‌ నువ్వు ఇదంతా చూస్తున్నావని’ నవీన్ పోలిశెట్టి ఎమోషనల్‌ పోస్ట్ : Naveen Polishetty video.

Covid :దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కరాళనృత్యం..మూతపడుతున్న స్కూల్స్.. మాల్స్ రెస్టారెంట్లపై ఆంక్షలు(వీడియో )

సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక ప్రకటన.. తెలంగాణలో రేపట్నుంచి విద్యాసంస్థలు బంద్: Telangana Schools bandh Live Video.