Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RSS: రాజకీయ సాధనంగా ఉపయోగించకూడదు.. కుల గణనపై ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన..

కుల గణన అనేది సున్నితమైన అంశం అని.. ఇది ఎల్లప్పుడూ వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఉండాలని.. కానీ.. దీనిని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాజకీయ సాధనంగా పరిగణించకూడదంటూ ఆర్ఎస్ఎస్ పేర్కొంది..

RSS: రాజకీయ సాధనంగా ఉపయోగించకూడదు.. కుల గణనపై ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన..
RSS’ Akhil Bharatiya Prachar Pramukh Sunil Ambekar
Shaik Madar Saheb
|

Updated on: Sep 02, 2024 | 5:59 PM

Share

కుల గణన అంశం జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది.. లోక్ సభ ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కుల గణ చేపట్టాలంటూ డిమాండ్ చేసింది.. దీని చుట్టూనే ఎన్నికల ప్రచారం జరిగింది.. అంతేకాకుండా, పార్లమెంట్ లో సైతం కుల గణన చేయాలంటూ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.. ఈ క్రమంలోనే బీజేపీ సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సోమవారం కుల గణనపై కీలక వ్యాఖ్యలు చేసింది. కుల గణన అనేది సున్నితమైన అంశం అని.. ఇది ఎల్లప్పుడూ వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఉండాలని.. కానీ.. దీనిని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాజకీయ సాధనంగా పరిగణించకూడదంటూ ఆర్ఎస్ఎస్ పేర్కొంది.. ఆర్‌ఎస్‌ఎస్ కుల డేటా సేకరణకు మద్దతు ఇస్తుందని.. కానీ దానిని ఎన్నికల్లో ప్రయోజనం కోసం రాజకీయ సాధనంగా ఉపయోగించకూడదని హెచ్చరించింది. కేరళలోని పాలక్కాడ్‌లో మూడు రోజుల పాటు జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ సమన్వయ బైఠక్‌లో కుల, సంబంధిత అంశాలను విస్తృతంగా చర్చించారు.

కేరళలోని పాలక్కాడ్‌లో మూడు రోజుల సమావేశాల అనంతరం ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ (ప్రధాన ప్రతినిధి) సునీల్ అంబేకర్ మాట్లాడారు.. కుల గణనకు తాము అనుకూలమని పేర్కొన్నారు.. కులాల డేటా పూర్తి చేయాలి.. కులాలు మన సమజాంతో సున్నితమైనవి.. ఇవి జాతీయ సమైక్యతకు ముఖ్యమైనవి అంటూ పేర్కొన్నారు. అయితే, కుల గణనను ఎన్నికల ప్రచారానికి, ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించరాదంటూ పేర్కొన్నారు. విధాన రూపకల్పనకు, అట్టడుగు వర్గాలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించేందుకు ఇది చాలా అవసరమని పేర్కొంటూనే.. సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగించాలంటూ పేర్కొన్నారు.

వీడియో చూడండి..

‘‘హిందూ సమాజంలో, కుల… కుల సంబంధాలు అత్యంత సున్నితమైన అంశాలు, జాతీయ ఐక్యత.. సమగ్రతతో లోతుగా ముడిపడి ఉన్నాయి. మేము, సంఘ్‌లో, కుల డేటాను ప్రాథమికంగా సంక్షేమ కార్యకలాపాలకు ఉపయోగించాలని, నిర్దిష్ట కులాలు, వర్గాల నిర్దిష్ట అవసరాలను తీర్చాలని నొక్కి చెబుతున్నాము. ఎన్నికల సమయంలో లేదా ఎన్నికల లబ్ధి కోసం ఈ డేటాను రాజకీయ సాధనంగా ఉపయోగించుకోకూడదు” అని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు.

“ఈ వర్గాల సంక్షేమాన్ని సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఖచ్చితమైన కుల సంఖ్యలు అవసరమని RSS విశ్వసిస్తుంది.. ఈ పద్ధతిని గతంలో అమలు చేసినప్పటికీ, జాగ్రత్తగా నిర్వహించాలి. రాజకీయ ప్రయోజనం కోసం తారుమారు కాకుండా నిజమైన అభ్యున్నతి.. మద్దతుపై దృష్టి కేంద్రీకరించాలి.’’ అంటూ సునీల్ అంబేకర్ పేర్కొన్నారు. కుల డేటాను అవకతవకల పద్ధతిలో ఉపయోగించినట్లయితే, అది మరింత సామాజిక విభజనను ప్రేరేపిస్తుందని.. అంబేకర్ వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..