పోలీసులను చూడగానే నీటిలోనే సంచులు పడేసి బోటులో పరారయిన వ్యక్తులు.. వాటిని ఓపెన్ చేయగా

శ్రీలంకలో సంక్షోభం కొనసాగుతుంది. వస్తుసేవల ధరలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో కొందరు అక్రమార్కులు కొన్ని రకాల ఉత్పత్తులు స్మగ్లింగ్ చేసి.. సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

పోలీసులను చూడగానే నీటిలోనే సంచులు పడేసి బోటులో పరారయిన వ్యక్తులు.. వాటిని ఓపెన్ చేయగా
Crime News
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 19, 2022 | 8:56 AM

శ్రీలంక(Sri Lanka)లో రాజకీయ, ఆర్థిక సంక్షోభం ఏ స్థాయికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకతతో ఆ దేశ అధ్యక్షుడే దేశం విడిచి పారిపోయిన పరిస్థితి. శ్రీలంకలో వస్తువులు, సేవల ధరలు ఇప్పటికీ మండిపోతున్నాయి. ఇంధన కొరత ఎక్కువగా ఉంది. పెట్రోల్ పంపుల వద్ద వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. గ్యాస్ కొరత వెంటాడుతుంది. చాలా హోటల్స్, రెస్టారెంట్స్ మూతబడిపోయాయి. అన్ని వస్తుసేవల ధరలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే పలు ఉత్పత్తులను ఆ దేశ అక్రమ రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు. ముఖ్యంగా తమిళనాడు తీర ప్రాంతాల నుంచి  పొగాకు ఉత్పత్తులు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ జరుగుతుంది. తాజాగా తమిళనాడు వెల్లాయిపట్టి తీరం( Vellaipatti coast) నుంచి శ్రీలంకకు అక్రమంగా రవాణా చేసేందుకు 20 లక్షల విలువైన బీడీ ఆకులను కోస్టల్ సెక్యూరిటీ గ్రూప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెల్లాయిపట్టి తీరం వెంబడి పెట్రోలింగ్ చేస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కోస్టల్ సెక్యూరిటీ గ్రూప్ పోలీసులు(Coastal Security Group police).. తీరానికి కొంత దూరంలో లంగరు వేసిన ఒక కంట్రీ బోట్‌లో కొంతమంది వ్యక్తులు సంచులు ఎక్కించడాన్ని గమనించారు. పోలీసులను చూడగానే స్మగ్లర్లు ఆ సంచులను సముద్రంలో పడేసి బోటులో పరారయ్యారు. సముద్రంలో తేలియాడుతున్న బ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు లోపల చెక్ చేయగా బీడీ ఆకులు కనిపించాయి.  మొత్తం రూ.20 లక్షల విలువైన 2500 కిలోల బరువున్న 28 బస్తాల బీడీ ఆకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోస్టల్ సెక్యూరిటీ గ్రూప్ పోలీసులు స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు. (Source)

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..