Delhi: కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..

ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె బెయిల్‌ పిటిషన్లను రౌస్‌ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసి ఏప్రిల్ 9 వరకు జ్యూడీషియల్ కస్టడీకి పంపింది. ఆ తరువాత ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ కోర్టులో కవిత వేసిన పిటిషన్లను న్యాయస్థానాలు కొట్టివేశాయి. దీంతో కవిత బెయిల్ కోసం ప్రయత్నించారు. తొలుత మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నించిన కవిత.. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుకాగా, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం పోరాడుతూనే ఉన్నారు.

Delhi: కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..
Mlc Kavita
Follow us

|

Updated on: May 06, 2024 | 1:02 PM

ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె బెయిల్‌ పిటిషన్లను రౌస్‌ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసి ఏప్రిల్ 9 వరకు జ్యూడీషియల్ కస్టడీకి పంపింది. ఆ తరువాత ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ కోర్టులో కవిత వేసిన పిటిషన్లను న్యాయస్థానాలు కొట్టివేశాయి. దీంతో కవిత బెయిల్ కోసం ప్రయత్నించారు. తొలుత మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నించిన కవిత.. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుకాగా, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం పోరాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ కింద తీహార్ జైలులో ఉన్నారామె. ఈ పరిస్థితుల్లో బెయిల్‌ ఇవ్వాలన్న కవిత అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. రెండు పిటిషన్లపై గత నెలలో విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండు పిటిషన్లను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీనికి సంబంధించి ‘సౌత్ గ్రూప్’తో కవితకు సంబంధాలు ఉన్నాయిని అరెస్టు చేశారు ఈడీ అధికారులు. ఆ తరువాత ఆమె తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను వేశారు. ఆ మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఈడీ అరెస్ట్ చేసిన తరువాత సీబీఐ కూడా రంగంలోకి దిగింది. ఎన్నికల నేపథ్యంలో స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. మహిళగా పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకారం బెయిల్‌కు అర్హత ఉందన్నారు ఆమె తరఫు లాయర్లు. అయితే ఇది హై ప్రొఫైల్ కేసు అని, ఇలాంటి పరిస్థితుల్లో కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావతం చేయగలరని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. దర్యాప్తు సంస్థల వాదనలు విన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా రిజర్వ్ చేసిన తీర్పును నేడు వెలువరించారు. ఈ తీర్పులో కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. ఇదిలా ఉంటే మే 7 మంగళవారంతో కవిత జ్యూడీషియల్ కస్టడీ గడువు ముగియనుంది. దీంతో ఆమె స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్