Delhi Airport: ఢిల్లీలో భారీ వర్షాలు.. ఎయిర్‌పోర్టులో కూలిన టెర్మినల్‌ పైకప్పు.. ఒకరు మృతి, 8 మందికి గాయాలు

Delhi Airport Terminal Roof Collapse: ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇందిరాగాంధీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో కొంత పైకప్పు భాగం కూప్ప కూలింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. స్పాట్‌లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో పైకప్పు కింది పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

Delhi Airport: ఢిల్లీలో భారీ వర్షాలు.. ఎయిర్‌పోర్టులో కూలిన టెర్మినల్‌ పైకప్పు.. ఒకరు మృతి, 8 మందికి గాయాలు
Delhi Airport Roof Collapse
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 28, 2024 | 12:17 PM

Delhi Airport Terminal Roof Collapse: ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇందిరాగాంధీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో కొంత పైకప్పు భాగం కూప్ప కూలింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. స్పాట్‌లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో పైకప్పు కింది పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పైకప్పు కూలడంతో కారులోని వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా పలు విమనాలు రద్దు చేశారు.. కాగా..ఈ ఘటనపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఢిల్లీ విమానాశ్రయంలో వ్యక్తిగతంగా తాను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోందని అని ట్వీట్ చేశారు. టెర్మినల్‌-1 దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2 వరకు టెర్మినల్‌-1 నుంచి డిపార్చర్‌కు బ్రేక్‌ ఇచ్చారు. పునరుద్ధరణ పనుల అనంతరం సర్వీసులను కొనసాగించనున్నారు.

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్ పోర్టుకు చేరుకుని.. టెర్మినల్ రూఫ్ పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను వివరాలు అడిగితెలుసుకున్నారు.. దీంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే.. కూలిన టెర్మినల్ 16 క్రితం నాటిదని పేర్కొంటున్నారు.

ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ సహా ఎన్‌సీఆర్‌లో ఏకధాటిగా వర్షం పడుతోంది. ఆర్కేపురం, సరితా విహార్, మునిర్కా, ఇండియా గేట్ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Delhi Airport Roof Collapse

గత రాత్రి నుంచి ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీగా వరద నీరు రావడంతో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. రోడ్లపైకి వర్షం నీళ్లు చేరడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఐతే ఉదయం నుంచి వర్షం పడుతుండడంతో వాహనదారులకు ట్రాఫిక్​ కష్టాలు తప్పడం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..