‘ప్రధాని మన్మోహన్ నిర్ణయాలను సోనియా మార్చేవారు..‘ కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికల వేళ 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న  యూపీఏ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలను నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మార్చేవారని వెల్లడించారు. 

‘ప్రధాని మన్మోహన్ నిర్ణయాలను సోనియా మార్చేవారు..‘ కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Sonia Gandhi, Manmohan Singh (Photo: PTI)
Follow us

|

Updated on: Apr 10, 2024 | 7:07 PM

సార్వత్రిక ఎన్నికల వేళ 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న  యూపీఏ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలను నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మార్చేవారని వెల్లడించారు.  యూపీఏ సర్కారు హయాంలో జూన్ 2011 నుంచి జూన్ 2013 వరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా ఉన్న ఆర్కే సింగ్ తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కీలక కామెంట్స్ చేశారు. ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ పూర్తి స్వతంత్రంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను సోనియా గాంధీ ప్రభావితం చేసే వారని ఆయన చెప్పుకొచ్చేవారు.

దీనికి సంబంధించి అప్పట్లో చోటుచేసుకున్న ఓ ఘటనను కూడా ఆర్కే సింగ్ గుర్తుచేసుకున్నారు. ప్రధాని అధ్యక్షతన జాతీయ విపత్తుల నిర్వాహణ సంస్థ(ఎన్డీఎంఏ)ని ఏర్పాటు చేయాలని యూపీఏ ప్రభుత్వ హయాంలో నిర్ణయం తీసుకొచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. దీనికి ప్రధాని సారథిగా, కేంద్ర మంత్రులు సభ్యులుగా ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు  వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనలు అడ్డుకుంటూ సోనియా గాంధీ లేఖ రాశారని వెల్లడించారు. స్వయంగా ప్రధాని దీనికి సారధిగా కాకుండా.. ప్రధాని నామినేట్ చేసిన వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉండాలని సోనియా గాంధీ సూచించినట్లు పేర్కొన్నారు. ఈ లేఖను నాటి హోం శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ తనకు చూపించారని.. ఇది సరైన నిర్ణయం కాదని అప్పుడు హోం శాఖ జాయింట్ సెక్రటరీగా ఉన్న తాను అభిప్రాయపడినట్లు ఆర్కే సింగ్ వెల్లడించారు. తన వాదనతో శివరాజ్ సింగ్ పాటిల్ కూడా ఏకీభవించినట్లు తెలిపారు. 20-25 రోజుల తర్వాత సోనియా గాంధీ నుంచి దీనికి సంబంధించి మరో లేఖ రాగా.. దీన్ని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదించినట్లు తెలిపారు.

యూపీఏ ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే సోనియా గాంధీ పాత్ర ఎక్కువని చెప్పేందుకు ఇదో ఉదాహరణగా ఆర్కే సింగ్ పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు దేశ ప్రధానిగా ఉన్నారు. అయితే ఆ సమయంలో మన్మోహన్ సింగ్ నిర్ణయాలను సోనియా గాంధీ ప్రభావితం చేసేవారని విపక్ష నేతలు తరచూ ఆరోపిస్తున్నారు. మన్మోహన్ సింగ్ కేవలం కీలబొమ్మగా ఉండేవారని.. నిర్ణయాధికారం పూర్తిగా సోనియా గాంధీ చేతిలో ఉండేదన్న ఆరోపణలు ఉండేవి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నాడు కీలక ప్రభుత్వ పదవిలో ఉన్న ఆర్కే సింగ్.. నాడు అధికార కారిడార్‌లో సోనియా గాంధీ ప్రభావంపై చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రధాని హోదాలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు మన్మోహన్ సింగ్‌కు లేకుండా పోయిందని ఆర్కే సింగ్ వ్యాఖ్యలు స్పష్టంచేస్తున్నాయి.

Latest Articles
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు..
రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు..
కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం కీలక ప్రకటన!
కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం కీలక ప్రకటన!
వామ్మో ఇదేం ఫోన్‌ పిచ్చి తల్లి..! ఏకంగా నెత్తిమీదికే ఎక్కిందిగా..
వామ్మో ఇదేం ఫోన్‌ పిచ్చి తల్లి..! ఏకంగా నెత్తిమీదికే ఎక్కిందిగా..
భారతీయుడు వచ్చేస్తున్నాడు..
భారతీయుడు వచ్చేస్తున్నాడు..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
దొంగిలించిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా గుర్తించడం ఎలా?
దొంగిలించిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా గుర్తించడం ఎలా?
పైల్స్ నొప్పితో బాధపడుతున్నారా? వంటింటి చిట్కాలు పాటించి చూడండి
పైల్స్ నొప్పితో బాధపడుతున్నారా? వంటింటి చిట్కాలు పాటించి చూడండి
సంచలన నిర్ణయం..18 లక్షల మొబైల్‌ నంబర్లు రద్దయ్యే అవకాశం..ఎందుకంటే
సంచలన నిర్ణయం..18 లక్షల మొబైల్‌ నంబర్లు రద్దయ్యే అవకాశం..ఎందుకంటే
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?