Corona Alert: ఆ ఏడు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం అలర్ట్..
కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివిటీ రేట్ 10 శాతం దాటడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రానున్నది పండుగల సీజన్ కాబట్టి మాస్ గేదరింగ్స్ ఉంటాయి. దాంతో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది.
Covid Cases Rise In India: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఢిల్లీ, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిసా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివిటీ రేట్ 10 శాతం దాటడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రానున్నది పండుగల సీజన్ కాబట్టి మాస్ గేదరింగ్స్ ఉంటాయి. దాంతో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. ఇది కేస్‌లోడ్స్ పెరగడానికి, మరణాలకు దారి తీసే ప్రమాదం కూడా ఉందని రాజేష్ భూషణ్ హెచ్చరించారు. వ్యాక్సినేషన్ వేగం పెంచాలి. ఐదు అంచెల స్ట్రాటజీని అనుసరించాలి. కొవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 100 మందికి కరోనా టెస్ట్ చేస్తే వారిలో పాజిటివ్ వచ్చిన వారి సంఖ్యను పాజిటివిటీ రేట్‌గా పేర్కొంటారు.
కేంద్రం లెక్కల ప్రకారం దేశంలో డెయిలీ పాజిటివిటీ రేట్ 4.96 ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేట్ 4.63 ఉంది. డెయిలీ హెల్త్ బులెటిన్ ప్రకారం ఢిల్లీలో నిన్న ఒక్క రోజే 2,419 కేసులు నమోదయ్యాయి. అక్కడ పాజిటివిటీ రేట్ 12.9 శాతం ఉంది. ఇంకొన్ని రాష్ట్రాల్లోనూ వీక్లీ పాజిటివిటీ రేట్ 10 శాతం దాటింది. అందుకే ఆ రాష్ట్రాలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రం చెబుతోంది. కరోనా లక్షణాల్లో కొన్ని మార్పులు, క్లినికల్ మేనిఫెస్టేషన్ వల్ల ఇన్‌ఫ్లూయెంజా, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల కేసులను జిల్లాల వారీగా పర్యవేక్షించడంతో కేంద్రానికి రిపోర్ట్ చేయాలని కోరారు.
దేశంలో 24 గంటల వ్యవధిలో 19 వేల 406 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.31 శాతం, రికవరీ రేట్ 98.50 శాతం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..